మొత్తానికి చెమటోడ్చి విజయాన్ని అందుకున్న భారత్

ప్రపంచ కప్ లో భాగంగా శనివారం టీమిండియా-ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

అయితే ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ కు దిగగా నిర్ణీత 50 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 224 పరుగుల మాత్రమే చేయగలిగింది.

టీమిండియా ఆటగాళ్లు ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి ఎక్కువ సేపు ఎవరూ కూడా క్రీజు లో నిలువలేక పోయారు.

కోహ్లీ(67),జాదవ్(52) పరుగుల తో కాస్త పరలేదు అనిపించారు.మిగిలిన రాహుల్,విజయ్ శంకర్,ధోనీ లు 30 లోపు పరుగుల తోనే సరిపెట్టుకున్నారు.

ఇక స్వల్ప లక్ష్యం తో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ తొలుత బాగా ఆడి ఒకానొక దశలో టీమిండియా ఓటమి అంచుల్లో చేరింది అనుకున్న సమయంలో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ వరుసగా మూడు వికెట్లు పడగొట్టి ఆఫ్ఘన్ వెన్ను విరిచాడు.

చివరి వరకు ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు ఆఫ్ఘన్ జట్టు 213 పరుగులకే ఆలౌట్ అవ్వడం తో భారత్ కేవలం 11 పరుగుల తేడా తో విజయాన్ని అందుకుంది.

"""/"/ ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెన్‌లో మహ్మద్ నబీ (51) అర్థశతకం నమోదు చేసుకోగా, కెప్టెన్ గుల్‍బదిన్ నైబ్ 27 పరుగులు సాధించాడు.

షమీ 4 వికెట్లు తీయగా, బుమ్రా, చాహల్, హార్దిక్ పాండ్య తలా 2 వికెట్లు పడగొట్టారు.

అయితే క్రికెట్ లో పసికూన గా భావించే ఆఫ్ఘన్ జట్టుపై భారత్ విజయాన్ని అందుకోవడం కోసం చెమటోడ్చాల్సి వచ్చింది.

అయితే తరువాత జరగబోయే మ్యాచ్ లో బంగ్లా దేశ్ తో టీమిండియా జట్టు ఎలాంటి ప్రణాళిక తో ముందుకు సాగుతుందో చూడాలి.

బ్రతకడానికి విద్య అవసరం లేదంటే ఇదే కాబోలు.. మహిళా ఇంగ్లీష్ అదుర్స్(వీడియో)