రష్యాకి బ్రహ్మోస్ క్షిపణులను సమకూర్చనున్న ఇండియా.. ఇందులో నిజం ఎంత..

రష్యా దేశం ఉక్రెయిన్‌పై( Russia ) యుద్ధం ప్రకటించిన సమయం నుంచి ఏ దేశానికి కూడా ఇండియా సపోర్ట్ చేయడం లేదు.

ఈ రెండు దేశాల విషయంలో అది న్యూట్రల్ గానే వ్యవహరిస్తోంది.ఎందుకంటే రష్యా మన మిత్ర దేశం.

ఇక ఉక్రెయిన్‌కు అమెరికా ఫుల్ సపోర్ట్ చేస్తుంది.దానిని తన దేశంగా భావిస్తోంది.

ఉక్రెయిన్‌కు ఇండియా వ్యతిరేకత చూస్తే అమెరికాతో సత్సంబంధాలు దెబ్బతింటాయి.అందుకే తటస్థ వైఖరిని మొదటినుంచి చాలా వ్యూహాత్మకంగా ఇండియా అవలంబిస్తోంది.

ఇదిలా ఉండగా తాజాగా రష్యాకి ఇండియా సహాయం చాలా అవసరమైందని సమాచారం. """/" / దాదాపు ఏడాదిన్నరగా విరామం లేకుండా రష్యా ఉక్రెయిన్( Ukraine ) దేశంపై యుద్ధం చేస్తోంది.

దీంతో చాలా వరకు దాని వద్ద ఆయుధాలు అయిపోతున్నాయి.ముఖ్యంగా మిస్సైల్‌ కొరత పుతిన్ ప్రభుత్వాన్ని బాగా వేధిస్తోంది.

ఇండియాలో మాత్రం మిస్సైల్స్‌ పుష్కలంగా ఉన్నాయి.త్రివిధ దళాలు చాలా సమర్థవంతంగా వాడగల బ్రహ్మోస్ కూడా ఇండియాలో అధికంగానే ఉన్నాయి.

అంతేకాకుండా ఇండియా వీటిని ఎప్పటికప్పుడు తయారు చేస్తూ వాటి సంఖ్య పెంచుతూనే ఉంది.

ఈ విషయాన్ని తెలుసుకున్న రాశా వీటిని తమకు పంపించాలని భారతదేశాన్ని కోరినట్లు తెలిసింది.

కాగా దీనిపై ఇండియా ఇంతవరకు స్పందించలేదని సమాచారం. """/" / ఒక న్యూస్ మీడియా ది వీక్‌తో ఒక ప్రశ్నోత్తరంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సీఈఓ అతుల్ దినకర్ రాణే( Atul Dinkar Rane ) మాట్లాడుతూ, తమ సంస్థ యొక్క బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణికి పెద్ద మార్కెట్‌ కావాలని రష్యా నిరంతరం చూస్తోందని అన్నారు.

రష్యా నిజంగానే భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి అస్పష్టంగానే ఉంది.

ఉక్రెయిన్‌లో యుద్ధం చేస్తున్నందున రష్యా ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణించింది.అందువల్ల ఇప్పుడు రష్యా ఇండియా నుంచి క్షిపణులను కొనుగోలు చేయలేకపోవచ్చు.

అలానే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రష్యాకు బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించడానికి భారతదేశం ఇష్టపడకపోవచ్చు.

అయితే రష్యా భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేస్తే అది ఆ దేశానికి మంచి పరిణామం అవుతుంది.

బ్రహ్మోస్ అత్యంత అధునాతన క్షిపణి.ఇది రష్యాకు దాని సైనిక సామర్థ్యాలలో చెప్పుకోదగిన బూస్ట్ ఇస్తుంది.

అంతే కాదు అనేక సంవత్సరాలుగా వ్యూహాత్మక మిత్రులుగా ఉన్న భారత్, రష్యాల మధ్య మంచి అనుబంధానికి ఇది మరోసారి రుజువు అవుతుంది.

బన్నీ నువ్వు నా బంగారం.. వివాదంపై స్పందించిన రాజేంద్రప్రసాద్!