నేడు జరిగే భారత్-ఐర్లాండ్ తొలి టీ 20 మ్యాచ్ కు వర్ష గండం..!

ఐర్లాండ్ పర్యటనలో భాగంగా భారత్-ఐర్లాండ్( India Vs Ireland ) మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ లో నేడు తొలి టీ20 మ్యాచ్ డబ్లిన్ వేదికగా జరుగనుంది.

భారత జట్టు పేసర్ జస్ ప్రీత్ బుమ్రా( Jasprit Bumrah ) రీఎంట్రీ కోసం ఎన్నో రోజులుగా అభిమానులు వేచి చూస్తున్న సంగతి తెలిసిందే.

ఈరోజు జరిగే మ్యాచ్ తో రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.కానీ బుమ్రా అభిమానులకు ఇంతలోనే ఒక బ్యాడ్ న్యూస్.

ఈరోజు జరిగే మ్యాచ్ కు వర్ష గండం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

"""/" / గత ఏడాది వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా.ఏడాది క్రితం శాస్త్ర చికిత్స చేయించుకుని ఎన్సీయే లో చేరి నెమ్మదిగా కోరుకున్నాడు.

దాదాపు 14 నెలల తర్వాత మళ్లీ టీమిండియా జెర్సీతో ఆడెందుకు బుమ్రా రెడీ అయ్యాడు.

ఐర్లాండ్ లో జరిగే మూడు టీ20 సిరీస్ లో( T20 Series ) భారత జట్టుకు బుమ్రా సారథ్యం వహిస్తున్నాడు.

ఈ ఏడాది జరిగే ఆసియా కప్ వరల్డ్ కప్ లలో బుమ్రా కీలక పాత్ర పోషించనున్నాడు.

"""/" / అయితే నేడు డబ్లిన్( Dublin ) వేదికగా జరగనున్న తొలి టీ20 లో బుమ్రా ఎలా రాణిస్తాడో అని ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

కానీ నేడు జరిగే మ్యాచ్ కు వర్ష గండం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

డబ్లిన్ వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నేడు 92 శాతం వర్షం పడే అవకాశం ఉంది.

దీంతో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అని ఉత్కంఠ నెలకొంది.ఇప్పటికే ఈ మ్యాచ్ టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయాయి.

ఈ సిరీస్ లో రెండో మ్యాచ్ కూడా డబ్లిన్ వేదికగా ఆదివారం జరగనుంది.

అయితే ఆదివారం జరిగే మ్యాచ్ కు ఎటువంటి ఇబ్బందులు ఉండవని వాతావరణ శాఖ తెలిపింది.

లోకో-పైలట్‌ ప్రేమలో యూకే మహిళ.. దీని వెనుక హార్ట్‌టచింగ్ స్టోరీ..?