మోడీ నాయకత్వంలో భారత్ పరివర్తన యుగంలో వుంది : ఎన్ఆర్ఐలతో కేంద్రమంత్రి షెకావత్

ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందన్నారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో వున్న ఆయన ఆదివారం వాషింగ్టన్‌లోని ఇండియన్ ఎంబసీలో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా షెకావత్ మాట్లాడుతూ.ప్రస్తుతం భారత్ పరివర్తన యుగంలో వుందని, ఈ మార్పులో భాగస్వామ్యం కావాలని ఆయన ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు.

"""/"/ మోడీ నాయకత్వంలో తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగా భారత్.నేడు వేగవంతమైన అభివృద్ధికి లాంచింగ్ ప్యాడ్‌గా వుందని కేంద్ర మంత్రి అన్నారు.

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే తన లక్ష్యాన్ని సాధించడానికి సిద్ధంగా వుందన్నారు.

ఈ రోజున ప్రపంచంలో భారత్‌ను విస్మరించగలిగే ఏ వేదిక లేదని షెకావత్ వ్యాఖ్యానించారు.

ప్రపంచస్థాయిలో భారత్ పాత్ర గణనీయంగా పెరిగిందని.అయా దేశాలు తమ సమస్యల నిమిత్తం ఇండియావైపే చూస్తున్నాయన్నారు.

ఇదే సమయంలో దేశంలోని సామాన్యుల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.

ఈ పరివర్తన ప్రక్రియలో భారతీయ అమెరికన్లు భాగస్వాములు కావాలని షెకావత్ పిలుపునిచ్చారు. """/"/ భారత సంతతికి చెందిన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఏఏపీఐ) మాజీ అధ్యక్షుడు డాక్టర్ వినోద్ కే షా మాట్లాడుతూ.

అమెరికాలో దశాబ్ధాల తరబడి వుంటున్న తాను భారత్ ఇప్పుడున్న స్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు.

భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి వినోద్ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదిలావుండగా.విదేశీ నిధులకు ఉద్దేశించిన ఎఫ్‌సీఆర్ఏ (ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్) నిబంధనలపై ప్రవాస భారతీయులు అడిగినప్రశ్నలకు షెకావత్ సమాధానం చెప్పారు.

20 వేలకు పైగా భారతీయ ఎన్జీవోలు విదేశాల నుంచి విరాళాలు అందుకుని భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అంతర్గత విచారణలో తేలిందన్నారు.

ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసిందని.దీని వల్ల నిజమైన ఎన్జీవోలు కూడా ప్రభావితమయ్యాయని షెకావత్ అంగీకరించారు.

 .