లోక్ సభ స్థానాలపై జాతీయ సర్వే ! ఏపీలో ఎవరికి ఎన్నంటే ..?

మళ్లీ కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు ? ఎవరికి ప్రజలు పట్టం కట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

హ్యాట్రిక్ విజయంతో మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని బిజెపి ( BJP )గట్టి ప్రయత్నాలు చేస్తుంది.

బలహీనంగా ఉన్న రాష్ట్రాల పైన ప్రత్యేకంగా దృష్టి సారించి అక్కడ వీలైనన్ని ఎక్కువ ఎంపి స్థానాలను దక్కించుకోవాలని చూస్తోంది.

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ పార్టీలను ఎన్డీఏలోకి ఆహ్వానించి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది.

వచ్చే ఎన్నికల్లో మరింత బలపడాలని ప్రయత్నాలు చేస్తోంది.ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.

విపక్ష పార్టీలన్నిటిని ఏకం చేసి దేశవ్యాప్తంగా బిజెపికి ఎదురుగాలి వీచే విధంగా చేయాలని ప్రయత్నాలు చేస్తూ, ఇండియా పేరుతో కొత్త కూటమి ని తెరపైకి తెచ్చింది.

ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. """/" / ఇక వివిధ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల పైన జనాల్లో ఆసక్తి నెలకొంది.

ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

తెలంగాణలో బీఆర్ఎస్( BRS Party ) ప్రస్తుతం అధికారంలో ఉంది.మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

మధ్యప్రదేశ్ లో బిజెపి ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది.

వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి.

దీంతో ప్రస్తుతం ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ దక్కుతుందో, ఆ పార్టీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఇండియా టీవీ సిఎన్ఎక్స్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న లోక్ సభ స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు దొరుతాయి అనేది ప్రకటించింది.

"""/" /  జాతీయస్థాయిలో ఏ పార్టీకి ఎన్ని లోక్ సభ స్థానాలు దక్కుతాయి అనేది రాష్ట్రాల వారీగా,  పార్టీల వారీగా వివరాలను ప్రకటించింది.

ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం చూసుకుంటే.కేంద్రంలో మళ్లీ ప్రధాని నరేంద్ర మోది( Narendra Modi ) నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి రాబోతుందని తేల్చింది.

ప్రతిపక్షాల సంకీర్ణ కూటమి ఇండియా గట్టి పోటీ ఇస్తుందని ఈ ఒపీనియన్ సర్వే వెల్లడించింది.

ఇక ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీకి తిరుగు ఉండదని ఇండియా టీవీ - సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ వెల్లడించింది.

ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా, అందులో 18 స్థానాలను వైసీపీ దక్కించుకుంటుందని ప్రతిపక్ష టిడిపి అభ్యర్థులు ఏడు స్థానాల్లో విజయం సాధిస్తారనే రిపోర్ట్ బయటపెట్టింది.

2019 ఎన్నికల్లో టిడిపి కేవలం మూడు లోక్ సభ స్థానాలను దక్కించుకోగా,  ఇప్పుడు వాటిని ఏడు కు పెంచుకుంటుందని వెల్లడించింది.

తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉండగా, బీఆర్ఎస్ ఎనిమిది ,బిజెపి ఆరు, కాంగ్రెస్ రెండు ,ఎంఐఎం ఒక స్థానాన్ని గెలుచుకుంటాయని వెల్లడించింది.

ఏపీ లో వైసిపి, టిడిపిలను మాత్రమే ఈ ఒపీనియన్ సర్వే పరిధిలోకి తీసుకుంది.

బీజేపీ , జనసేన పార్టీలను లెక్కల్లోకి తీసుకోలేదు.

సొంత సినిమాలనే డైరెక్ట్ చేసుకుంటే వాటి పరిస్థితి ఇలాగే ఉంటుంది.