చైనా, పాకిస్తాన్ బలగాలకు భారత ఆర్మీ చెక్ పెట్టబోతోందా..?
TeluguStop.com
యుద్ద పరికరాల్లోకి ఇప్పుడు స్మార్ట్ డోన్లు( Smart Drones ) కూడా చేరాయి.
అన్ని దేశాలు స్మార్ట్ డ్రోన్లను సమకూర్చుకుంటున్నాయి.ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా మధ్య ఏడాదికిపైగా భీకర యుద్దం కొనసాగుతోంది.
ఈ యుద్దం వల్ల రెండు దేశాలు నష్టపోతున్నాయి.సైనిక దాడి, బాంబులు, మారణాయుధాలతో దాడి వల్ల సైనికులతో పాటు సాధారణ ప్రజలు కూడా మరణిస్తున్నారు.
అయితే ఇప్పుడు కొత్తగా స్మార్ట్ డ్రోన్ల సహాయంతో కూడా దాడులు చేపడుతున్నారు.శత్రువులను లక్ష్యంగా చేసుకోవడానికి వీటిని ఉపయోగిస్తున్నారు.
ఇటీవల సిరియాలో రష్యా( Russia ) ఆధీనంలో కొనసాగుతున్న ఖమీమ్ సైనిక స్థావరంపై 2018లో 13 డ్రోన్లు దాడికి పాల్పడ్డాయి.
యుద్దాల్లో భాగంగా ఒకేసారి ఇన్ని డ్రోన్లు వచ్చి దాడి చేయడం ప్రపంచంలోనే అదే తొలిసారి.
అప్పటినుంచి ప్రపంచదేశాలు కూడా స్మార్ట్ డ్రోన్లను సిద్దం చేసుకుంటున్నాయి.చౌకగా లభించడంతో పాటు వీటిని సులువుగా ఉపయోగించవచ్చు.
ఇవి సైనిక స్థావరాలపై దాడి చేయడంతో పాటు తేలికపాటి ఆయుధాలు, వస్తువులను మోసుకెళ్లగలవు.
"""/" /
స్మార్ట్ డోన్లు లక్ష్యాన్ని ఢీకొట్టి నాశనం చేయగలవు.డ్రోన్లన్నీ ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుంటూ శత్రువులపై ఏకకాలంలో దాడి చేపడతాయి.
దీంతో భవిష్యత్తులో యుద్దాలలో( War ) ఇవి ఉపయోగపడనున్నాయి.మనిషి జోక్యం అవసరం లేకుండానే ఇవి శత్రువులపై దాడి చేస్తాయి.
వెయ్యి కంటే ఎక్కువ డ్రోన్లు కూడా సమూహంగా ఎగురుతూ లక్ష్యంపై గురిపెడతాయి.ప్రతి డ్రోన్ స్వతంత్రంగా పనిచేసుకుంటూ సమూహంలోని మిగతా డ్రోన్లతో సమన్వయాన్ని కలిగి ఉంటాయి.
"""/" /
మానవ ప్రమేయం లేకుండానే అసాధారణ వేగంగా పనిని పూర్తి చేసే సామర్థ్యం ఈ స్మార్ట్ డ్రోన్లకు ఉంటుంది.
ఖమీమ్ వైమానిక స్థావరంపై ఉపయోగించినవి తొలితరం డ్రోన్లు.కానీ ఇప్పుడు అత్యాధునిక వేగంతో పనిచేసే డ్రోన్లు అందుబాటులోకి వస్తాయి.
దీంతో భారత్( India ) కూడా డ్రోన్లను ఏర్పాటు చేసుకుంటుది.చైనా, రష్యా మెరుగైన డ్రోన్లను ఉత్పత్తి చేస్తున్నాయి.
దీంతో వాటిని ఢీకొట్టేలా భారత్ ప్రయత్నాలు ఉన్నాయి.
లాంగ్ అండ్ స్మూత్ హెయిర్ కోసం ఈ ఫ్రూట్ మాస్క్ ను తప్పక ట్రై చేయండి!