ఇండియా కూడా చైనాను బీట్‌ చేయబోతుంది

కరోనా వైరస్‌ చైనాలో పుట్టింది.వూహాన్‌ నగరం నుండి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.

200లకు పైగా దేశాల్లో కరోనా కల్లోలం కనిపిస్తుంది.ఈ సమయంలో ఇండియాలో మాత్రం కాస్త పర్వాలేదు అనుకున్నారు.

130 కోట్ల మంది జనాభ ఉన్న దేశంలో కేసుల సంఖ్య అదుపులోనే ఉందంటూ ఇన్నాళ్లు ప్రకటన చేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తన మాటను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

చైనాలో మొదట్లోనే కరోనా పాజిటివ్‌ ల సంఖ్య 81 వేలు దాటింది.చైనా కేసులను ఇటలీ, స్పెయిన్‌, అమెరికా, రష్యాతో పాటు ఇంకా పలు దేశాలు కూడా ఇప్పటికే దాటేశాయి.

కాని ఇండియా మాత్రం చైనాను దాటక పోవచ్చు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాని అనూహ్యంగా చైనాను సైతం ఇండియా దాటేసేందుకు రెడీ అయ్యింది.నేటితో ఇండియాలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య చైనాను బీట్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

నిన్నటి వరకు కరోనా కేసుల సంఖ్య 81970గా నమోదు అయ్యింది.చైనాను దాటేయబోతున్న ఇండియా ముందు ముందు మరెన్ని రికార్డులను బ్రేక్‌ చేస్తుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

వైసీపీదే అధికారమని చెబుతున్న మరో సర్వే.. ఈ ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేదా?