ఆల్ఇంగ్లాండ్ ఫైనల్ కు దూసుకెళ్లిన భారత యువ షట్లర్ లక్ష్య సేన్

భారత యువ షట్లర్ లక్ష్య సేన్ వరుసగా దిగ్గజ ఆటగాళ్లను ఓడిస్తూ ఆశ్చర్య పరుస్తున్నాడు.

ప్రస్తుతం జరుగుతున్న ఆల్ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ లలో ఈ బ్యాడ్మింటన్‌ ప్లేయర్ మెరుగైన ఆటతో దూసుకెళ్తున్నాడు.

కొద్ది గంటల క్రితమే జరిగిన సెమీఫైనల్లో లీ జి జియా (మలేసియా)ను లక్ష్య సేన్ చిత్తుగా ఓడించాడు.

ఈ మ్యాచ్ 76 నిమిషాలపాటు నువ్వానేనా అన్నట్లు చాలా ఉత్కంఠగా సాగింది.ఆఖరి నిమిషం వరకు గట్టి పోటీని ఎదుర్కొన్న లక్ష్య సేన్ చివరికి 21-13, 12-21, 21-19 తేడాతో లీ జి జియాపై విజయకేతనం ఎగురవేశాడు.

ఈ సంచలన విజయంతో అతడు ఆల్ ఇంగ్లాండ్ ఫైనల్ కి దూసుకెళ్ళాడు.ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు.

ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ లో ఇప్పటిదాక ఫైనల్ కు చేరుకున్న భారత ప్లేయర్లు కేవలం ముగ్గురే కావడం విశేషం.

1980లో ప్రకాష్ పదుకొనే ఫైనల్ చేరుకుని టైటిల్ సాధించాడు.2001లో పుల్లెల గోపీచంద్ కూడా ఈ మెగా టోర్నీలో ఛాంపియన్ గా నిలిచాడు.

అయితే 1947లో ప్రకాష్ నాథ్ రన్నరప్ గా నిలిచాడు. """/"/ ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు కేవలం ఇద్దరు మాత్రమే గెలవగా.

లక్ష్య సేన్ మూడో వ్యక్తి కాబోతున్నాడు.ప్రపంచ నంబర్‌వన్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌), నాలుగో ర్యాంకర్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) మధ్య రెండో సెమీఫైనల్‌ త్వరలోనే జరగనుంది.

ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారితో ఫైనల్ మ్యాచ్ ఆడతాడు లక్ష్య సేన్.

ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్ ఆల్ ఇంగ్లాండ్ ఫైనల్లో గెలిస్తే అది తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయం అవుతుంది.

ఇక గత వారం లక్ష్య సేన్ జర్మన్ ఓపెన్ లో రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఏడడుగుల అమ్మాయితో ప్రేమలో పడ్డ మూడడుగుల వ్యక్తి.. వీడియో వైరల్..