ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా వర్షాలు మెండుగా కురిశాయి.దాని ఫలితంగా ఎప్పుడు వెలవెలబోతూ ఉండే నదులు,ప్రాజెక్టులు ఇప్పుడు నిండుకుండలా కళకళలాడుతున్నాయి.
ఈ సంవత్సరం కురిసిన వర్షాలు అతివృష్టి అని దాని ఫలితంగానే దేశంలోని పలు చోట్ల వరదలు నమోదయ్యాయని వాతావరణ విభాగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒక్క మన దేశంలోనే కాకుండా ఈసారి చైనాలో కూడా భారీ వర్షాలు కురిశాయి.
ఇలాంటి వర్షపాతం 80 ఏళ్లలో ఎప్పుడూ లేదని చైనా వాతావరణ విభాగ నిపుణులు చెబుతున్నారు.
మన దేశంలోని వాతావరణ నిపుణులు అభిప్రాయపడినట్లు ఈసారి కురిసిన వర్షాలు 44 ఏళ్లలో ఇదే తొలిసారని భారత వాతావరణ విభాగం ధృవీకరించింది.
ఈసారి ఆగస్టులో సాధారణంగా కురిసే వర్షం కంటే 27 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదు అయిందని ఈ స్థాయిలో వర్షపాతం నమోదు అవ్వడం 44 ఏళ్లలో ఇదే తొలిసారని 120 ఏళ్లలో అధిక స్థాయి వర్షపాతం నమోదవ్వడం ఇది నాలుగోసారని భారత వాతావరణ విభాగం అంటుంది.
గతంలో 1926లో 33 శాతం, 1973లో 27.8 శాతం,1976లో 28.
4 శాతం,2020 ఆగస్ట్ లో 27 శాతం అధిక వర్షపాతం నమోదు అయిందని భారత వాతావరణ విభాగం గణాంకాలను విడుదల చేసింది
.
బస్సులో నిద్రిస్తున్న మహిళను వేధించిన కండక్టర్.. వీడు కండక్టర్ కాదు, కామాంధుడు.. వీడియో వైరల్