ఆసియా క్రీడల్లో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరిన భారత్..!

ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్( Bangladesh ) జట్టును చిత్తుగా ఓడించి ఫైనల్ చేరింది.

తాజాగా హంగ్ జౌ లోని క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో ఈరోజు ఉదయం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ అద్భుతమైన ఘనవిజయం సాధించింది.

"""/" / ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది.

భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక బంగ్లాదేశ్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టి భారీ పరుగులు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు.

బంగ్లాదేశ్ బ్యాటర్లైన జాకర్ అలీ( Jaker Ali ) 24 పరుగులు, పర్వేజ్ హోస్సేన్ ఎమోన్ 23 పరుగులు చేశారు.

మిగిలిన బ్యాటర్లు చెప్పుకోదగ్గ పరుగులు నమోదు చేయడంలో విఫలం కావడం వల్ల బంగ్లాదేశ్ కేవలం 96 పరుగులు మాత్రమే నమోదు చేసింది.

"""/" / భారత బౌలర్లైన సాయి కిషోర్ ఏకంగా మూడు వికెట్లు తీయగా.

తిలక్ వర్మ,( Tilak Varma ) అర్షదీప్ సింగ్, షాబాద్ అహ్మద్, రవి బిష్ణోయ్ చెరో ఒక వికెట్ తీశారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని చేదించడం కోసం బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది.

భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాలుగు బంతులు ఆడి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

భారత జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్( Ruturaj Gaikwad ), తెలుగు ఆటగాడైనా తిలక్ వర్మ జత కలిసి బౌండరీల వర్షం కురిపించడంతో భారత్ 9.

2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 97 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది.

రుతురాజ్ గైక్వాడ్ 40, తిలక్ వర్మ 55 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.

ఆసియా క్రీడల్లో భాగంగా శనివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో ప్రత్యర్థి జట్టుతో భారత్ టైటిల్ కోసం తలపడనుంది.

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పేరు మారిందా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమిదే!