త్వరపడండి.. భారతీయ పోస్టల్ లో 21,413 భర్తీకి నోటిఫికేషన్ విడుదల
TeluguStop.com
ఇండియా పోస్టల్ డిపార్ట్‌మెంట్ భారీ సంఖ్యలో గ్రామీణ్ డాక్ సేవక్( GDS ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 21,413 ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో( Andhra Pradesh ) 1215, తెలంగాణలో( Telangana ) 519 ఖాళీలు ఉన్నాయి.
ఈ పోస్టులకు పదో తరగతి అర్హతతో పాటు కంప్యూటర్ జ్ఞానం కలిగిన వారు అర్హులు.
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మార్చి 3, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.గ్రామీణన్ డాక్ సేవక్ కింద బ్రాంచ్ పోస్ట్ మాస్టర్( BPM ), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్( ABPM ), డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇక ఈ నోటిఫికేషన్ ప్రకారం.ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే.
ఫిబ్రవరి 10, 2025 నుండి దరఖాస్తు ప్రారంభం కాగా.మార్చి 3, 2025 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.
చివరిలో కరెక్షన్ విండో మార్చి 6 నుండి మార్చి 8 వరకు ఓపెన్ చేస్తారు.
అభ్యర్థులు పదో తరగతి( 10th Class ) ఉత్తీర్ణులై ఉండాలి.కంప్యూటర్ స్కిల్ తప్పనిసరి.
సైకిల్ లేదా స్కూటర్ నడిపే నైపుణ్యం కలిగి ఉండాలి.వయోపరిమితి విషయానికి వస్తే.
కనీస వయసు 18 సంవత్సరాలు ఉండగా.గరిష్ట వయసు 40 సంవత్సరాలుగా నిర్ణయించారు.
నిబంధనల ప్రకారం వయసులో సడలింపు లభిస్తుంది. """/" /
దరఖాస్తు రుసుము చూస్తే.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100, SC/ST/PWD/మహిళా అభ్యర్థులు/ట్రాన్స్ ఉమెన్ లకు ఎంటువంటి రుసుము లేదు.
దేశవ్యాప్తంగా.21,413 మొత్తం పోస్టులు ఉన్నాయి.
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 1215, తెలంగాణలో 519 పోస్టులు ఉన్నాయి.ఇక వేతనం విషయానికి వస్తే.
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)కు రూ.12,000 నుండి రూ.
29,380 వరకు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/డాక్ సేవక్ కు రూ.
10,000 నుండి రూ.24,470 వరకు పొందుతారు.
"""/" /
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే ముందు రిజిస్ట్రేషన్ చేయాలి.
రిజిస్ట్రేషన్ సమయంలో యాక్టివ్ మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ తప్పనిసరి.రిజిస్ట్రేషన్ అనంతరం ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించాలి.
అభ్యర్థి ఇటీవలి ఫోటో, సంతకం పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.జీడీఎస్ పోస్టులు కేంద్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాల కిందకు రానివి.
వీటి జీతాలు, అలవెన్సులు కేంద్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఉండవు.అభ్యర్థులు దీనిని గమనించి దరఖాస్తు చేసుకోవాలి.
మామిడిపండ్లు తిన్న వెంటనే నీరు తాగుతున్నారా.. జాగ్రత్త!