రష్యా- ఉక్రెయిన్ వార్ : చమురు సంక్షోభం రాకుండా ఎత్తుగడ.. అమెరికా ప్రతిపాదనకు భారత్ సపోర్ట్

వూహించిందంతా అయ్యింది.గత కొన్నిరోజులుగా అమెరికా హెచ్చరించినదే జరిగింది.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దంతెత్తింది.అసాధారణ ఆయుధ సంపత్తి, బలగం వున్న రష్యా ధాటికి ఉక్రెయిన్ విలవిల లాడుతోంది.

అయినప్పటికీ తన శక్తిమేర పోరాడు తూనే వుంది.మాతృభూమి కోసం ఉక్రెయిన్ సైనికులు సైతం తమ ప్రాణాలను బలిస్తున్నారు.

అయితే నిపుణులు ముందుగా హెచ్చరించినట్లుగానే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆయిల్ సంక్షోభం తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆయిల్ సరఫరాపై ప్రభావం మొదలైంది.యుద్ధం ఎన్నిరోజులు జరుగుతుందనే దానిపైనా ఇది ఆధారపడి వుంది.

అంతర్జాతీయంగా ముడి చమురు ధర ఫిబ్రవరి 24న ఏకంగా 105 డాలర్లకు చేరింది.

అయితే ఉక్రెయిన్‌పై దాడికి నిరసనగా రష్యాపై ఆంక్షలు విధిస్తున్న పాశ్చాత్య దేశాలు .

చమురును మాత్రం వాటి నుంచి మినహాయించాయి.దీంతో ముడి చమురు ధర స్ధిరంగా కొనసాగుతోంది.

ప్రపంచంలోనే చమురు దిగుమతి, వినియోగం విషయంలో మూడో స్థానంలో వున్న భారత్.వివిధ దేశాల నుంచి 85 శాతం చమురు దిగుమతి చేసుకుంటోంది.

పరిస్ధితి ఎటు నుంచి ఎటు తిరిగినా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల్లో ఒడి దొడుకులు, క్రూడాయిల్ ధరల పెరుగుదల ప్రభావం పడకుండా ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

ప్రస్తుతానికి మనదేశం వద్ద 39 మిలియన్ బ్యారెల్స్ చమురు నిల్వలు వున్నాయి.ఈ నేపథ్యంలో వ్యూహాత్మక చమురు నిల్వలు వినియోగించుకోవాలని భారత్ భావిస్తోంది.

ఈ క్రమంలోనే వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేయడానికి అమెరికా వేసిన బిడ్‌కు భారత్ శనివారం మద్ధతు తెలిపింది.

"""/" / మార్కెట్ అస్థిరతను తగ్గించడానికి , ముడి చమురు ధరల పెరుగుదలను నియంత్రించేందుకు వీలుగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను విడుదల చేయడానికి భారత్ కూడా కట్టుబడి వుందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

చమురు ధరలను తగ్గించడానికి వ్యూహాత్మక నిల్వలను సమన్వయంతో విడుదల చేయడానికి భారత్, చైనా, దక్షిణకొరియా, జపాన్ వంటి ప్రధాన వినియోగదారులను ఒప్పించేందుకు నవంబర్ చివరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చొరవ తీసుకున్నారు.

ఆ సమయంలో అమెరికా 50 మిలియన్ బ్యారెల్స్‌ను విడుదల చేయగా.భారత్ 5 మిలియన్ బ్యారెల్స్‌ను విడుదల చేసింది.

చదివిన ఐఐటీకి 228 కోట్ల రూపాయల భారీ విరాళం.. ఈ వ్యక్తి మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!