డబ్ల్యూటీవో వివాదాలకు ముగింపు .. అమెరికన్ ఉత్పత్తులకు తలుపులు తెరిచిన భారత్

గతేడాది డజనుకు పైగా డబ్ల్యూటీవో( W.T.

O ) వివాదాలను పరిష్కరించిన తర్వాత అమెరికా రైతులకు ప్రయోజనం చేకూర్చే అనేక యూఎస్ ఉత్పత్తులకు భారత్ తన మార్కెట్‌ను తెరిచిందని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికారి మంగళవారం ఆ దేశ చట్టసభలకు తెలియజేశారు.

భారతదేశం తీసుకున్న చర్యలు టర్కీ, డక్, బ్లూబెర్రీస్ , క్రాన్‌బెర్రీస్‌కు( Turkey, Duck, Blueberries, Cranberries ) ఎక్కువ మార్కెట్ యాక్సెస్‌ను అందించినట్లయ్యింది.

తద్వారా అనేక అమెరికన్ రాష్ట్రాల రైతులకు ప్రయోజనం చేకూర్చాయని అమెరికా వాణిజ్య ప్రతినిధి కేథరీన్ తాయ్( Catherine Tai ) .

బైడెన్ 2024 ట్రేడ్ పాలసీ ఎజెండాపై వేస్ అండ్ మీన్స్ హౌస్ కమిటీ( Ways And Means House Committee ) సభ్యులతో అన్నారు.

గతేడాది జూన్‌లో భారత్-అమెరికాలు ఆరు డబ్ల్యూటీవో వివాదాలను ముగించాయని తాయ్ తెలిపారు.యూఎస్ ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను తొలగించడానికి భారత్ అంగీకరించిందని ఆమె వెల్లడించారు.

దీనర్థం మిచిగాన్, ఒరెగాన్, వాషింగ్టన్ సహా దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనం చేకూర్చే చిక్‌పీస్, కాయధాన్యాలు, బాదం, వాల్‌నట్, యాపిల్స్‌ ఉత్పత్తులకు మెరుగైన యాక్సెస్ వుంటుందని కేథరీన్ అన్నారు.

"""/" / కాగా.2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారం అమెరికాలో ఊపందుకుంది.

రెండు పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజల ముందు పెడుతున్నారు.

కోర్టు కేసులు, న్యాయపరమైన అభియోగాలతో ఇబ్బందపడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )సైతం రంగంలోకి దిగారు.

తాను మరోసారి అధ్యక్షుడినైతే కఠినమైన వాణిజ్య విధానాలు అవలంభిస్తామని సంకేతాలు ఇవ్వడంతో అమెరికన్ వ్యాపార సంఘంలో ఆందోళన మొదలైంది.

"""/" / కొద్దిరోజుల క్రితం ట్రంప్ మాట్లాడుతూ.మరోసారి తాను అధ్యక్షుడినైతే భారత్‌పై ప్రతీకార పన్ను విధిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత్‌లో అమెరికా ఉత్పత్తులపై అత్యధిక పన్నులు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇండియాలో 100 శాతం, 150 శాతం, 200 శాతం పన్నులు వున్నాయని.

పరిస్ధితులు ఇలాగే కొనసాగితే అమెరికన్ కంపెనీలు భారత్‌లో వ్యాపారం ఎలా చేస్తాయని ట్రంప్ ప్రశ్నించారు.

2024లో రిపబ్లికన్ పార్టీని గెలిపిస్తే.భారత్‌పై పరస్పర సమానమైన ప్రతీకార పన్నులు విధిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

గేమ్ చేంజర్ సినిమా క్లైమాక్స్ ఫైట్ కోసం 15 కోట్లు ఖర్చు పెట్టారా..?