కేంద్రం కీలక ప్రకటన : “ఈ – వీసా” లలో మొదటి ప్రాధాన్యత వారికే...!!!

ఆఫ్ఘాన్ లో తాలిబాన్ల రాజ్యం వచ్చిన తరువాత వారి అరాచకాలకు భయపడిపోతున్న ఆఫ్ఘాన్ వాసులు విదేశాలలో తల దాచుకునేందుకు కుటుంభ సభ్యులతో కలిసి కాబూల్ లోని విమానాశ్రయానికి లక్షలాది మంది చేరుకుంటున్నారు.

పలు దేశాలు వారి రాకపై అభ్యంతరాలు పెడుతున్న తరుణంలో భారత్ వారికి అండగా నిలిచింది.

వారికీ మేము ఆశ్రయం కల్పిస్తామని హామీ ఇచ్చింది.ఇందులో భాగంగానే ఈ వీసా విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టిన విషయం విధితమే.

ఆఫ్ఘాన్ నుంచీ భారత్ లోకి వచ్చే వారికోసం అత్యంత వేగంగా ప్రాసెస్ చేయడానికి ఈ – వీసా విధానాన్ని ప్రవేశపెట్టారు.

అంతేకాదు ఈ వీసా కాలపరిమితిని ఆరు నెలల వరకూ విధించారు.ఇదిలాఉంటే తాజాగా కేంద్రం ఈ వీసా విధానంపై మరో కీలక ప్రకటన చేసింది.

ఈ వీసా విధానం ద్వారా ఆఫ్ఘాన్ నుంచీ వచ్చే వారిలో అత్యధికంగా మహిళలు, విద్యార్ధులు, స్వచ్చంద సంస్థ కార్యకర్తలకు ఈ వీసాల జారీలో తోలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా కేంద్ర ప్రకటించింది.

అంతేకాదు """/"/ ఆఫ్ఘాన్ లో భారత్ ఎన్నో వేల కోట్లతో భారీ ప్రాజెక్ట్ లు, ఆసుపత్రులు, స్కూల్ భవనాలు నిర్మించింది.

ఆ సమయంలో ఈ నిర్మాణ కార్యక్రమాలకు సహకరించిన ఎంతో మంది ఆఫ్ఘాన్ వాసులకు కూడా ఈ వీసాలో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం సంభందిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది.

ఇదిలాఉంటే భారత ప్రభుత్వం ఆఫ్ఘాన్ లో ఉన్న భారతీయులు అందరిని సురక్షితంగా భారత్ తీసుకోవచ్చేందుకు ప్రత్యేక విమానాలని ఏర్పాటు చేస్తూ అత్యంత భద్రత నడుమ వారిని తీసుకువస్తోంది.

వందలాది మంది ఇప్పటకే భారత్ రాగా, ఇంకా వందల సంఖ్యలో భారతీయులు ఆఫ్ఘాన్ లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది.

రైలులో చోటులేదనేమో.. 290 కి.మీ. ఏకంగా రైలు కోచ్ కింద ప్రయాణించిన వ్యక్తి