వన్డే సిరీస్ ని కోల్పోయిన టీం ఇండియా! 3-2 తో ఆస్ట్రేలియా సిరీస్ కైవసం!

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి మ్యాచ్ వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించి సిరీస్ ని 3-2తో సొంతం చేసుకుంది.

ఢిల్లీ వేదికగా జరిగిన చివరి మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఎబ్భై ఓవర్స్ లో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.

చేధించగలిగే లక్ష్యంతోనే బరిలో దిగిన టీం ఇండియా ఓపెనర్స్ లో రోహిత్ శర్మతో పాటు విజయ్ శంకర్ జోడీగా వచ్చాడు.

అయితే రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో రాణించిన విజయ్ శంకర్ తక్కువ స్కోర్ కే అవుట్ అయ్యాడు.

ఆ తరువాత విరాట్ తో సహా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ అందరూ విఫలం అయ్యారు.

చివర్లో కేదార్ జాదవ్, భువనేశ్వర్ కుమార్ రాణించి గెలుపుపై ఆశలు కలిగించిన అది ఎంతో సేపు నిలవలేదు.

భువనేశ్వర్ తర్వాత మిగిలిన బ్యాట్స్ మెన్స్ వరుసగా అవుట్ కావడంతో టీం ఇండియా చివరి ఓవర్లో చివరి బంతికి ఆల్ అవుట్ అయ్యింది.

దీంతో ఆస్ట్రేలియ 35 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది.దీంతో ఐదు వన్డేల సిరీస్ ని ఆస్ట్రేలియా 3-2తో సొంతం చేసుకుంది.

మొత్తానికి ప్రపంచ కప్ ముందు భారత్ కి ఇది ఊహించని దెబ్బ అని చెప్పాలి.

ప్రపంచంలోనే స్ట్రాంగ్ లైన్ అప్ ఉన్న టీం అంటూ ప్రశంసలు అందుకున్న భారత్ రెండు మ్యాచ్ లలో విజయం సొంతం చేసుకొని వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయి సిరిస్ వదులుకుంది.

ఇక టీ-20 సిరీస్ ని కూడా భారత్ కోల్పోయి రెండు సిరీస్ లని ఆస్ట్రేలియాకి అప్పగించింది.