ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న విషయం చాలా ఆందోళనకరంగా మారింది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 500 దాటడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుండి పూర్తి లాక్‌డౌన్ ప్రకటించారు.
సోషల్ డిస్టెన్సింగ్‌తోనే కరోనా వైరస్ వ్యాప్తిని అరకట్టగలమని ఆయన తెలిపారు.కరోనా వ్యాప్తి చాలా వేగవంతంగా సాగుతోందన్న విషయం దేశ ప్రజలను తీవ్ర ఆందోలళనకు గురిచేస్తుందని, వారి శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మోదీ తెలిపారు.
దేశ వ్యాప్తంగా నేటి రాత్రి నుంచి 21 రోజుల పాటు పూర్తి లాక్‌డౌన్ అమలులో ఉంటుందని, ప్రజలు ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని ఆయన తెలిపారు.
కరోనా మహమ్మారిని అందరం కలిసి తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ వైరస్ పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.