ఆర్థిక కూటముల మధ్య భారత్ ప్రయాణం

ప్రస్తుత ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో వివిధ రకాల కూటములు ఉద్భవిస్తూ , ఆయా దేశాల భవిష్యత్తును నిర్దేశించుకుంటూ ముందుకు సాగుతున్నాయి.

అందులో భాగంగానే రష్యా ఆధ్వర్యంలో నడుస్తున్న ఈస్ట్రటన్ ఎకనామిక్ ఫోరం, అమెరికా ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేం వర్క్ లోను భాగస్వామిగా ఉన్న భారత్ చాలా చాకచక్యంగా వ్యవహరించవలసిన ఆవశ్యకత ఉంది.

ఎందుకంటే చైనా లీడ్ రీజినల్ కాంప్రెహెన్స్ వ్ ఎకనామిక్ పార్టనర్ షిప్ కూటమిలో భారత్ భాగస్వామ్యం లేకపోవడం ఒకటైతే, మరోపక్క అమెరికా తోపాటు ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించటం, అదే సమయంలో మన భారత్ రష్యాతో సన్నిహితంగా మెలగడం వంటి విషయాలు ద్రృష్టిలో ఉంచుకుని ఈ కూటములతో మన భవిష్యత్తు అవసరాల కోసం చాలా జాగ్రత్తగా నడుచుకోవలసిన ఆవశ్యకత ఉంది.

‌ 2015లో రష్యా అధ్యక్షతన రష్యా ఫార్ ఈస్ట్ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే ఉద్దేశ్యంతో పరిశ్రమలు స్థాపించడానికి, వ్యాపార అభివృద్ధికి, ఎక్కువ పెట్టుబడులు సంపాదన కోసం, విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి ఈ.

ఈ.ఎఫ్ ఏర్పాటు చేశారు.

దీంతో రష్యా - ఆసియా దేశాల మధ్య రాకపోకలు, ఎగుమతులు దిగుమతులు పెరగడం, వ్యాపార అభివృద్ధి సాధిస్తూ, యూరోపియన్ దేశాలకు రష్యా "చెక్" పెట్టే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతోంది.

‌ దీనిలో భాగంగా ఈఈఎఫ్ 2017లో 217 ఒప్పందాలు కుదుర్చుకొనగా, 2021 నాటికి 380 అగ్రిమెంట్లు జరగగా, వీటి విలువ సుమారు 3.

6 ట్రిలియన్ల్ రూబుల్స్ గా ఉన్నాయి.ప్రస్తుతం 2022 నాటికి 2729 పెట్టుబడులతో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.

‌ ముఖ్యంగా మౌలిక వసతులు, రవాణా, ఖనిజాల త్రవ్వకం, నిర్మాణ రంగం, పరిశ్రమలు, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టినాయి.

ఈనెల సెప్టెంబర్ 5-8 తేదీల మధ్య " వ్లాడివోస్టోక్" నందు ఈఈఎఫ్ సమావేశాలు జరిగిన నేపథ్యంలో రష్యా లోని ఫార్ ఈస్ట్ ప్రాంతాన్ని ఆసియా పసిఫిక్ ప్రాంతంతో అనుసంధానం చేయడమే ప్రధాన లక్ష్యంగా కొనసాగింది.

‌ ఈఈఎఫ్ లో చైనా అతి పెద్ద భాగస్వామిగా ఉంది.మరియు తన బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియాటివ్ మరియు పోలార్ సీ రూట్ కొరకు సద్వినియోగం చేసుకుంటుంది.

ఈఈఎఫ్ లో చైనా 90% పెట్టుబడులు పెట్టింది.2015 నుంచి రష్యా, చైనా పెట్టుబడులు ఆహ్వానిస్తోంది.

"""/"/ ఇప్పుడు మరెంత ఎక్కువగా పెట్టుబడులు మరెన్నో దేశాల నుంచి రాబట్టుకునే విధంగా ప్రణాళికలు రష్యా సిద్ధం చేసింది.

దీనికి కారణం ప్రస్తుతం రష్యా అనేక దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్నది.ట్రాన్స్ సైబీరియన్ రైల్వే రష్యా - చైనాకు బహుళ ప్రయోజనం.

ఈ రెండు దేశాల సరిహద్దు సుమారు 4000 కి.మీ కలిగి ఉండుట వలన అనేక రకాలుగా అభివృద్ధి పరిచేందుకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చు కొనుటకు ఉపయోగపడుతుంది.

అదే విధంగా చైనా తన హిలాంగ్ జియాంగ్ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.

చైనా రష్యా ఒక సమీక్రృత అభివృద్ధి నిధి ఏర్పాటు చేసుకుని ఆర్.ఎఫ్.

ఇ ని చైనా లోని నార్త్ ఈస్ట్ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు అడుగులు వేస్తోంది.

అదే సమయంలో బ్లాగోవేశ్చెన్స్కే , హేఇహె నగరాల మధ్య 1080 మీటర్ల బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం, నాచురల్ గ్యాస్ సరఫరా, నిజహ్నేలేనింస్కోయె మరియు టోంగ్జీ నగరాలను కలుపుతూ రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

‌ .

ఫోకస్ పెంచిన కేటీఆర్.. నేడు రోడ్డు షో