భారత్ సరికొత్త పంథాలో నడవాల్సి ఉంది.. కేసీఆర్
TeluguStop.com
భారత్ సరికొత్త పంథాలో నడవాల్సి ఉందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
మహారాష్ట్రలోని సర్కోలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ పార్టీ దేశంలో మార్పు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయిందన్న కేసీఆర్ 75 ఏళ్ల తరువాత భారత్ లో అభివృద్ధి ఎలా ఉందో ఆలోచించాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్ దాదాపు 50 సంవత్సరాలు దేశాన్ని పాలించిందన్నారు.కాంగ్రెస్ తో పాటు శివసేన, బీజేపీకి ప్రజలు అవకాశం ఇచ్చారని చెప్పారు.
అతి తక్కువ సమయంలో తెలంగాణ అభివృద్ధి సాధించిందని తెలిపారు.ఈ క్రమంలో తెలంగాణలో అభివృద్ధి సాధ్యం అయినప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కాదని ప్రశ్నించారు.
వెంకీ అట్లూరి ఇక తెలుగు హీరోలతో సినిమాలు చేయాడా..?