కెనడా : గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత ప్రభుత్వం

ఎన్నో పంజాబీ ముఠాలు కెనడాను అడ్డాగా చేసుకుని భారత్‌లో నేర సామ్రాజ్యాలను విస్తరిస్తున్నాయి.

కిరాయి హత్యలు, డ్రగ్స్, ఆక్రమ ఆయుధాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయి.ఈ నేపథ్యంలో కెనడాలో వుంటూ పంజాబ్‌లో( Punjab ) కార్యకలాపాలు సాగిస్తున్న గ్యాంగ్‌స్టర్‌లను పట్టుకునేందుకు తమకు సహకరించాలంటూ ఇటీవల కెనడా ప్రభుత్వాన్ని కోరారు సీఎం భగవంత్ మాన్.

ఇప్పటికే పలువురు గ్యాంగ్‌స్టర్‌లపై పంజాబ్ ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో పాటు అప్పగింతపై కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూనే వున్నారు.

వీరిలో లఖ్‌బీర్ సింగ్ లాండా, అర్ష్ ధల్లా, గోల్డీ బ్రార్, రామన్ జడ్జి, రింకు రంధావా, బాబా డల్లా, సుఖా దునేకే ఇలా పేరు మోసిన గ్యాంగ్‌స్టర్లంతా కెనడాలోనే వున్నారు.

"""/" / తాజాగా కెనడాలో ఆశ్రయం పొందుతున్న గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్( Lakhbir Singh Landa ) లాండాను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది.

ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) చేసిన ఆరోపణలు, దానికి న్యూఢిల్లీ కౌంటర్, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల మధ్య భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

లాండా ప్రస్తుతం కెనడాలోని ఎడ్మోంటన్‌లో వుంటున్నాడు.కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రటకించిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌‌లో లాండా సభ్యుడు.

H3 Class=subheader-styleఎవరీ లఖ్‌బీర్ సింగ్ లాండా :/h3p """/" / గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండా పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లా హరికేకు చెందినవాడు.

అతని తండ్రి నరంజన్ సింగ్ (75) మాజీ సైనికుడు .తల్లి పర్మీందర్ కౌర్ (65) వీరి కుటుంబానికి సొంత ఇల్లు, ట్రాక్టర్, విలాసవంతమైన కారు, 20 ఎకరాల భూమి వుంది.

లాండాపై హత్య, హత్యాయత్నం, కాల్పులు వంటి దాదాపు 20 క్రిమినల్ కేసులు వున్నాయి.

ఈ స్థాయిలో కేసులు వున్నా.అతను రెండేళ్ల క్రితం విదేశాలకు పారిపోయాడు.

ఈ నేపథ్యంలో అతని అప్పగింత సహా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు.

అతనిపై అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ తరన్ తారన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గమనార్హం.

వ్యాపారులు, కాలనీవాసులు, డాక్టర్లను బెదిరించి ఇతను వసూళ్లకు పాల్పడేవాడని పోలీసులు చెబుతున్నారు.2021 మే 27న పట్టి వద్ద ఇద్దరు అకాలీదళ్ కార్యకర్తలను కాల్చిచంపిన కేసులోనూ అతను ప్రధాన సూత్రధారి.