టీ20 క్రికెట్ ఫార్మాట్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత్..!

భారత్ వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ ( Australia )మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా జరిగిన నాలుగవ టి20 మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయం సాధించి, ఈ సిరీస్ లో ఆడాల్సిన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్( India ) సిరీస్ టైటిల్ కైవసం చేసుకుంది.

అంతేకాకుండా టీ20 క్రికెట్ ఫార్మాట్ లో భారత్ ఒక సరికొత్త చరిత్రనే సృష్టించింది.

ఈ టీ20 మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ టీ20 ఫార్మాట్ లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డ్ సృష్టించింది.

"""/" / గతంలో ఈ రికార్డ్ పాకిస్తాన్ పేరిట ఉండేది.పాకిస్తాన్ జట్టు మొత్తం 226 మ్యాచ్ లలో 135 విజయాలు సాధించి టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఉండేది.

కానీ భారత్ టీ20ల్లో తాజాగా 136 విజయం సాధించి పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టింది.

ప్రస్తుతం భారత్ టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. """/" / అత్యధిక విజయాలు సాధించిన జట్లలో తర్వాత న్యూజిలాండ్ జట్టు( New Zealand ) 200 మ్యాచ్ లలో 102 విజయాలు సాధించి మూడవ స్థానంలో ఉండగా.

ఆస్ట్రేలియా జట్టు 1081 మ్యాచ్ లలో 95 విజయాలు సాధించి నాలుగవ స్థానంలో ఉండగా.

దక్షిణాఫ్రికా జట్టు 171 మ్యాచ్ లలో 95 విజయాలతో 5వ స్థానంలో నిలిచింది.

ఇక తాజాగా జరుగుతున్న టీ20 సిరీస్ విషయానికి వస్తే.సూర్య కుమార్ యాదవ్( Suryakumar Yadav ) కెప్టెన్సీలో భారత జట్టు తొలి టైటిల్ కైవసం చేసుకుంది.

ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ లో భారత్ 3-1 ఆధిక్యంలో ఉంది.బెంగళూరు వేదికగా జరగనున్న అయిదవ మ్యాచ్లో గెలిచి కనీసం పరువు నిలబెట్టుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.

భారత జట్టు మాత్రం ఇదే ఫామ్ ను కొనసాగించి ఐదవ మ్యాచ్లో కూడా ఘనవిజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.

బాహుబలి తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.. తమన్నా షాకింగ్ కామెంట్స్!