ఔనా : నోట్ల ముద్రణ ప్రభుత్వం చేతుల్లో పనే కదా.. ఎందుకు ఎక్కువ ముద్రించరో తెలుసా?

కరోనా విలయతాంఢవం చేస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆర్థికపరమైన సమస్యలతో బాధపడుతున్నారు.

కేంద్రం ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితి ఇలాగే కొనసాగితే కనీసం ఉద్యోగులకు సగం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ఇలాంటి సమయంలో ఆర్థిక రంగం మళ్లీ పుంజుకోవాలంటే ఏం చేయాలి అంటూ ఆర్థిక రంగ నిపుణులతో ప్రభుత్వాలు చర్చిస్తున్నాయి.

లక్షల కోట్ల నష్టం వాటిల్లుతున్న ఈ సమయంలో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ అనేది సామాన్యులకు అస్సలు తెలియదు.

"""/"/ చాలా మంది కూడా ఇలాంటి సమయంలో డబ్బులు ఎక్కువగా ప్రింట్‌ చేయవచ్చు కదా, ఆ డబ్బును పేదలకు ఇవ్వొచ్చు కదా అంటూ అనుకుంటూ ఉంటారు.

ప్రభుత్వం చేతిలో పని కనుక డబ్బును ఎక్కువ ప్రింట్‌ చేసి ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇస్తే పోయేది ఏముంది అనుకునే వారు చాలా మంది ఉంటారు.

కాని అలా చేస్తే కొత్త సమస్యలు రావడంతో పాటు ప్రపంచంలో అత్యంత వెనుకబడే దేశంగా మన దేశం మారిపోతుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

"""/"/ గతంలో కొన్ని లాటిన్‌ ఇంకా ఆఫ్రికా దేశాలు అలాగే కరెన్సీని ముద్రించి తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నారు.

కొన్ని దేశాలు ఇంకా కూడా ఆర్థిక సంక్షోభం నుండి బయట పడలేదు.ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా జింబాబ్వేను ఉదాహరణగా చెబుతారు.

కొన్ని సంవత్సరాల క్రితం జింబాబ్వేలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినది.ప్రజల వద్ద డబ్బు లేకపోవడంతో పాటు ప్రభుత్వం కూడా డబ్బు లేక చేతులు ఎత్తేసిన వేళ అక్కడి ప్రభుత్వం పెద్ద ఎత్తున నోట్లను ముద్రించింది.

నోట్లు ఎక్కువగా ముద్రించడంతో కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. """/"/ విదేశాల కరెన్సీతో మన దేశం కరెన్సీ విలువ ఎంత తక్కువ అయితే ఆర్థిక సంక్షోభం అంతగా ఎక్కువ అవుతుంది.

జింబాబ్వే పరిస్థితి చాలా దారుణంగా తయారు అయ్యింది.ఆ దేశంలో ముద్రించిన కరెన్సీని జనాలు పట్టించుకునే పరిస్థితి లేదు.

అప్పుడప్పుడు గూగుల్‌లో నోట్ల కట్టలను రోడ్ల మీద పోసి అమ్ముతుంటారు.నోట్లు ఎక్కువగా ముద్రిస్తే అలాంటి పరిస్థితులు వస్తాయి.

ఇండియాలో కూడా భారీగా నోట్లను ముద్రిస్తే ఆ తర్వాత వాటిని రోడ్ల మీద అమ్ముకోవాల్సిందే అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే5, ఆదివారం 2024