భారత్ లో మళ్లీ కరోనా బలపడుతుంది అనే టాక్ అంతర్జాతీయస్థాయిలో బలంగా వినబడుతోంది.
ఇదే తరుణంలో మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక మరికొన్ని రాష్ట్రాల్లో కేసులు కూడా పెరుగుతూ ఉండటంతో కేంద్రం కూడా అలర్ట్ అవుతున్న పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా మహమ్మారి వైరస్ ప్రభావం ఎంత ఉంది అన్న దానిపై తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేయడం జరిగింది.
బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 16,577.
దీంతో మొత్తం సంఖ్య 1,10,63,491కు చేరింది.గడచిన 24 గంటల్లో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య చూసుకుంటే 120.
దీంతో దేశ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1,56,825 కు పెరిగింది.అదేవిధంగా కరోనా నుండి గడచిన 24 గంటల్లో 12,179 మంది కోలుకోవడంతో…1,07,50,680 మంది కోలుకున్నట్టు అయింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య చూసుకుంటే 1,55,986.వీరిలో కొంతమంది హాస్పిటల్ లో.
మరికొంతమంది ఇంటి వద్దనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. """/"/.
ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..