ఆ హాస్పిటల్‌లో 26 మంది నర్సులకు, 3 డాక్టర్‌లకు కరోనా పాజిటివ్‌

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విలయతాంఢవం చేస్తూనే ఉంది.రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య అంతకంతకు పెరుగూతనే ఉంది.

వెయ్యికి చేరువగా కరోనా పాజిటివ్‌ల సంఖ్య వచ్చింది.మహారాష్ట్రలో అధికంగా ముంబయిలోనే కరోనా పాజిటివ్‌ల కేసులు నమోదు అవుతున్నాయి.

తాజాగా ముంబయిలోని ప్రముఖ హాస్పిటల్‌ అయిన వోకార్డ్‌ లో ఏకంగా 26 మంది సిస్టర్స్‌కు ఇంకా మూగ్గురు డ్యూటీ డాక్టర్స్‌కు కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది.

ఒక్కసారిగా హాస్పిటల్‌లో ఇంతటి కేసులు నమోదు అవ్వడంకు కారణం ఏంటా అంటూ అధికారులు విచారిస్తున్నారు.

అలాగే ఆ హాస్పిటల్‌ను పూర్తిగా మూసేశారు.అందులో ఉన్న దాదాపు 270 మంది రోగులను ఇంకా హాస్పిటల్‌ సిబ్బందిని పూర్తిగా అందులోనే ఉంచుతున్నారు.

ఆ ఏరియాను పూర్తిగా రెడ్‌ జోన్‌గా ప్రకటించడంతో పాటు అటుగా ఎవరిని వెళ్లనివ్వడం లేదు.

ప్రస్తుతం 29 మందికి పాజిటివ్‌ రాగా ఇతరులకు రెండు మూడు సార్లు టెస్టులు నిర్వహించి నెగటివ్‌ వస్తే అప్పుడు వారిని బయటకు పంపిస్తామంటూ అధికారులు చెబుతున్నారు.

మరో వైపు హాస్పిటల్‌ ను ఇంకా పరిసరాలను పూర్తిగా శానిటైజ్‌ చేస్తున్నారు.

మానసిక స్థిమితం లేని కోమటిరెడ్డి మాటలు నమ్మను..: కౌశిక్ రెడ్డి