అనుకున్నదంతా అయ్యింది.. కెనడాలో కాన్సులర్ క్యాంప్‌లు రద్దు చేసిన భారత్
TeluguStop.com
హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్య కారణంగా భారత్ - కెనడాల మధ్య దౌత్యపరమైన విభేదాలు మరింత దిగజారాయి.
ఈ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు.
ఇటీవల నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో కెనడాలోని భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ( Indian High Commissioner Sanjay Kumar Verma ) పేరును చేర్చడంతో న్యూఢిల్లీ భగ్గుమంది.
వెంటనే హైకమీషనర్ సహా దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది. """/" /
ఇలాంటి వేళ రెండ్రోజుల క్రితం బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంపై ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాదులు దాడి చేయడం కలకలం రేపింది.
ప్రస్తుతం అక్కడి పరిస్ధితి నివురుగప్పిన నిప్పులా ఉంది.ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భద్రతా కారణాల దృష్ట్యా.కెనడాలో నిర్వహించాలనుకున్న కాన్సులర్ క్యాంప్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
కమ్యూనిటీ క్యాంప్ నిర్వహిణకు భద్రత కల్పించలేమని కెనడియన్ భద్రతా ఏజెన్సీలు చేతులెత్తేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టొరంటోలోని భారత కాన్సులేట్ ఎక్స్ ద్వారా తెలిపింది.
"""/" /
కాగా.కెనడాలో నివాసం ఉంటున్న పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్లు వంటి సేవలను అందించడానికి ప్రతియేటా కాన్సులర్ క్యాంప్‌లు నిర్వహిస్తారు.
పెన్షన్ ప్రయోజనాల కోసం సర్టిఫికెట్లు ఉచితంగా జారీ చేస్తారు.భారత్ - కెనడాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాజా కాన్సులర్ క్యాంప్‌లకు అంతరాయం కలిగించడానికి ఖలిస్తాన్ మద్ధతుదారులు యత్నిస్తారని కొన్ని వర్గాలు భయపడుతున్నాయి.
ఒట్టావాలోని భారత హైకమీషన్‌తో పాటు టొరంటో, వాంకోవర్‌లలోని భారతీయ కాన్సులేట్‌లు, అంటారియో, క్యూబెక్, మానిటోబా, సస్కట్చేవాన్, అల్బెర్టా, నోవాస్కోటియా ప్రావిన్సులలో ఇందుకోసం వేదికలను సిద్ధం చేసింది భారత విదేశాంగ శాఖ.
వీటిలో గురుద్వారాలు, హిందూ దేవాలయాలు ఉన్నాయి.కాన్సులర్ క్యాంప్‌లకు విఘాతం కలగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని ఇప్పటికే బ్రిటీష్ కొలంబియా సుప్రీంకోర్ట్ భద్రతా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఆ లోపు బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంపై దాడి జరగడంతో పరిస్ధితులు క్షీణించాయి.
వైరల్: జకార్తా వీధుల్లో నాగుపాము మాంసంతో వంటకాలు.. ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది!