దయనీయ స్ధితిలో భారతీయ కార్మికుడి మృతి .. బాధ్యులపై చర్యలు తీసుకోండి : ఇటలీని కోరిన మోడీ సర్కార్

భారత్‌కు చెందిన సత్నామ్ సింగ్( Satnam Singh ) అనే ఓ కార్మికుడు ఇటలీలో( Italy ) అత్యంత దయనీయ స్ధితిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

దీంతో ఇటలీ ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో 31 ఏళ్ల కార్మికుడి మరణానికి కారణమైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా భారత్( India ) బుధవారం ఇటలీని కోరింది.

కాన్సులేట్ సాయంతో పాటు మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఇటలీలోని భారత రాయబార కార్యాలయం బాధితుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోంది.

"""/" / కాగా.పంజాబ్‌కు చెందిన సత్నామ్ సింగ్ (31) అనే కార్మికుడు ఇటలీలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసేందుకు అనధికారికంగా వెళ్లాడు.

అక్కడి ఓ వ్యవసాయ క్షేత్రంలో పనికి కుదిరిన ఆయన.కొద్దిరోజుల క్రితం ఎండుగడ్డిని కత్తిరిస్తుండగా ప్రమాదవశాత్తూ చేయి తెగింది.

దీంతో వ్యవసాయ క్షేత్రంలోని సిబ్బంది అతనిని ఆసుపత్రికి తరలించకుండా ఒక చెత్త బస్తాలో ఉంచి రోడ్డు పక్కన పడేశారు.

బాధితుడి భార్య, సన్నిహితులు దీనిపై పోలీసులకు సమాచారం అందించారు.దీనిపై స్పందించిన అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సత్నామ్ సింగ్‌ను హుటాహుటిన ఎయిర్ అంబులెన్స్‌లో రోమ్‌లోని( Rome ) ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ సత్నామ్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. """/" / ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని కుదిపేయడంతో పాటు ఇటలీలోని ప్రమాదకర పరిస్ధితుల్లో పనిచేస్తున్న కార్మికుల క్షేమంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమను ఇక్కడి యజమానులు కుక్కల్లా చూస్తున్నారని, తమ శ్రమను దోపిడీ చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు.

మరోవైపు ఇటలీ పార్లమెంట్‌ను సైతం ఈ అంశం కుదిపేసింది.కార్మికుడి మృతికి ఆ దేశ ప్రధాని జార్జియా మెలోని( Prime Minister Giorgia Meloni ) సంతాపం ప్రకటించి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని జార్జియా మెలోని వెల్లడించారు.

Narendra Modi Brings Good News To Khammam