ఇండియా కూటమి అధికారంలోకి రాదు నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు..!!

దేశంలో నేడు ఆరో దశ పోలింగ్ ముగిసింది.ఈసారి సార్వత్రిక ఎన్నికలు ( General Elections )మొత్తం ఏడు దశలలో జరుగుతుంది.

ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి.నేడు ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 58 లోక్ సభ స్థానాలలో ఆరో దశ పోలింగ్ జరిగింది.

బీహార్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఢిల్లీ, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాష్ట్రాలలో పోలింగ్ జరిగింది.

జూన్ 1వ తేదీన ఆఖరి దశ పోలింగ్ తరువాత జూన్ 4వ తారీఖు ఫలితాలు వెలువడనున్నాయి.

"""/" / ఈ క్రమంలో ఆరో దశ పోలింగ్ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ( Narendra Modi ) సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

"2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు ఆరోదశ పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

పోలింగ్ సాగే కొద్దీ ఎన్డిఏ (NDA)గెలిచే స్థానాల సంఖ్య అంతకంతకు మెరుగవుతోంది.ఇండియా కూటమి అధికారానికి దరిదాపుల్లోకి కూడా రాదన్న విషయం ప్రజలకు అర్థమయింది.

ఆ కూటమికి ఓటు వేస్తే వ్యర్ధమని గ్రహించారు" అంటూ మోదీ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలు చాలా హోరాహోరీగా సాగాయి.గతంలో కంటే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు.

బలపడ్డాయి.జూన్ ఒకటవ తారీకు నాడు ఏడవ దశ పోలింగ్ ముగియనుంది.

జూన్ 4వ తారీఖు ఫలితాలు వెలువడనున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్24, ఆదివారం 2024