ఆ హీరోయిన్ మరో కీర్తి సురేష్ అంటా.. ఆ ఒక్క మాటతో ఓ రేంజ్ లో సంతోషం?

కోలీవుడ్ బ్యూటీ నటి ఇందుజ గురించి మనందరికీ తెలిసిందే .మొదట మేయాద మాన్ సినిమాతో తమిళ సినీ ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ్మ.

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇందుజ.ఆ తర్వాత మెర్క్యురీ,60 వయదు మానిరం,బిల్లాపాండి, బూమరంగ్, మహాముని, సూపర్ డూపర్, బిగిల్,మూక్కుత్తి అమ్మన్ లాంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది.

అయితే ఇందుజ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే అప్పుడప్పుడు తన అభిమానులతో లైవ్ లో చిట్ చాట్ నిర్వహిస్తూ ఉంటుంది.

ఇక సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.

ఇందుజ కు యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే కొన్ని కొన్ని సార్లు ఈమె సోషల్ మీడియాలో ట్రోల్స్ ని సైతం ఎదుర్కొంటూ ఉంటుంది.

అయితే ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండే ఇందుజ ప్రస్తుతం కాస్త సన్నబడి మరింత స్లిమ్ గా మారింది.

అయితే ఇందుజ స్లిమ్ గా మారడం కోసం బ్యూటీషియన్లు, డైటీషియన్ ల సలహాలు పాటించినట్లు తెలుస్తోంది.

"""/"/ ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

ఆ ఫోటోలలో ఇందుజ స్లిమ్ గా ఉంది.ఆ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు,స్నేహితులు ఆశ్చర్యపోతున్నారు.

అందంగా ఉన్నావు అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు.ఇంకొందరు నేటిజన్స్ అయితే ఏమి అందం.

ఏమి అందం మరొక కీర్తి సురేష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక అభిమానుల కామెంట్స్ చూసిన ఇందుజ ఆనందంతో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మురిసిపోతోంది.

ప్రస్తుతం ఇందుజకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

జుట్టు ఆరోగ్యానికి బెస్ట్ ప్రోటీన్ మాస్క్ ఇది.. అస్సలు మిస్ అవ్వకండి!