తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంల్లో అంబరాన్నంటుతున్న స్వతంత్ర దినోత్సవ వేడుకలు

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం విరి వనాల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నటుతునాయి.

వివిధ రకాల ఖరీదైన ఆకర్షణ మొక్కలతో సందేశాత్మక ఆకృతులను ఏర్పాటు చేసే కడియం నర్సరీ మెన్ అసోసియేషన్ అధ్యక్షులు, కడియపులంక శ్రీ సత్య దేవా నర్సరీ యాజమాన్యం ఈ ఏడాది కూడా స్వతంత్ర దినోత్సవ వన కుర్పులో అగ్రగామిగా నిలిచింది.

వివిధ రకాల బోర్డర్ మొక్కలతో స్వతంత్ర దినోత్సవానికి స్వాగతం పలుకుతూ శ్రమతో జాతీయ పతాకం ఆకృతి రూపొందించారు.

హర్ ఘర్ తిరంగా.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 వసంతాల జాతీయ జెండాతో కూడిన ఆకృతిని మొక్కల కూర్పు అద్భుతంగా తీర్చిదిద్దారు.

అలాగే పర్యావరణం పై అవగాహన కల్పించేందుకే మొక్కలతో ఇటువంటి విభిన్న ఆకృతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని నర్సరీ రైతులు పుల్లా చంటియ్య, పుల్లా అబ్బులు, పెద సత్యనారాయణలు తెలిపారు.

అలానే కడియం పల్ల వెంకన్న నర్సురీ లో కూడా దేశభక్తి గుభాళించింది.కడియం నర్సరీమేన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పుల్లా అబ్బులు నర్సరీ లో 60 వేల మొక్కలతో త్రివర్ణ పతాక శోభను అలంకరించారు.

అందం దాగిన మొక్కలతో అద్భుతమైన సందేశం ఇవ్వడం లో దిట్టయిన ప్రముఖ నర్సరీ రైతు, ల్యాండ్ స్కేప్ డిజైనర్ పల్ల వెంకటేష్ సందర్భాన్ని బట్టి అద్భుతమైన కాన్వాస్ లను రూపు దిద్దుతారు.

రెండు రోజుల ముందు నుండే బోర్డర్ ,అలంకార రకాల మొక్కలతో పూలను మేళవించి ఆకృతులను అలంకరిస్తారు.

ఈ ఏడాది కేవలం రెండు గంటల వ్యవధిలోనే 75 వ స్వాతంత్ర్య స్వేచ్చా భారతి ని నర్సరీలో గుభాళింప జేశారు.

ఈ ఆకృతి వద్ద ఇండియన్ నర్సరీమేన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పల్ల సుభ్రమణ్యం,ప్రముఖ నర్సరీ రైతులు పల్ల సత్యనారాయణ మూర్తి, బొర్సు గోపి,ధర్మాసనం వెంకటరమణ,పల్ల వినయ్ తదితరులు భారత మాతకు జేజేలు పలికి దేశభక్తి ని చాటారు.

ఎడిటర్ ఇచ్చిన సలహా తో నిలబడిన తెలుగు సినిమాలు