దక్షిణాఫ్రికా - బీహార్ మధ్య పర్యాటకుల్ని ఇలా పెంచండి: ‘‘బీహార్ దివాస్‌’’లో భారత సంతతి దౌత్యవేత్త

కరోనా దెబ్బకు తీవ్రంగా ప్రభావితమైన రంగం పర్యాటక రంగం.ఫస్ట్‌వేవ్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుని పలు దేశాలు టూరిస్ట్‌లకు స్వాగతం పలికాయి.

కానీ సెకండ్ వేవ్ వాటికి బ్రేక్ వేసింది.భారత్‌తో సహా పలు దేశాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులను దాదాపు అన్ని దేశాలు నిలిపివేశాయి.

తాజాగా మళ్లీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు దేశాలు పర్యాటక రంగానికి ఊతమివ్వాలని భావిస్తున్నాయి.

చాలా దేశాల ఆర్ధిక వ్యవస్థలకు భారతీయులు మహారాజ పోషకులు.పర్యాటకం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైద్యం కోసం ఆయా దేశాలకు వెళుతూ వుంటారు.

ఆంక్షల నేపథ్యంలో భారత్ నుంచి ప్రయాణాలు నిలిచిపోవడంతో కొన్ని దేశాలు విలవిలలాడుతున్నాయి.ఇందులో దక్షిణాఫ్రికా కూడా ఒకటి.

ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి పర్యాటకులను తిరిగి ఆకర్షించాలనే ఉద్దేశంతో దక్షిణాఫ్రికా పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఈ నేపథ్యంలో 1860ల నుంచి నేటి వరకు దక్షిణాఫ్రికాలో చెరకు పంటకు కార్మికులుగా బీహార్‌కు చెందిన వారు పనిచేశారని ఆ దేశ దౌత్యవేత్త ఒకరు చెప్పారు.

ఈ లింకుల ఆధారంగా పర్యాటకాన్ని పెంచాలని ఆయన సూచించారు.దక్షిణాఫ్రికా ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ అండ్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఆసియా డిప్యూటీ డైరెక్టర్‌గా వున్న బీహార్ సంతతికి చెందిన డాక్టర్ అనిల్ సూక్‌లాల్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దక్షిణాఫ్రికాలోని భారతీయ సంతతికి చెందిన 1.4 మిలియన్ల మందికి తమ మూలాలను తిరిగి కనుగొనేలా ప్రాజెక్ట్‌లను ప్రారంభించాల్సిన అవసరం వుందన్నారు.

"""/"/ మంగళవారం పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిర్వహించిన లింక్ అప్ కార్యక్రమానికి అనుగుణంగా జోహన్నెస్‌బర్గ్‌లో కాన్సుల్ జనరల్ అంజు రంజన్ ఏర్పాటు చేసిన బీహార్ దివాస్ కార్యక్రమంలో సూక్‌లాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

1860 నుంచి 1911 మధ్య.1,52,000 మంది భారతీయులు ఒప్పంద పథకం కింద దక్షిణాఫ్రికాకు వచ్చారని ఆయన తెలిపారు.

వీరిలో ఎంతోమంది మూలాలు బీహార్‌లో వున్నాయని సూక్‌లాల్ పేర్కొన్నారు.కోవిడ్ 19 వ్యాప్తికి ముందు.

భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు ఏడాదికి 1,00,000 మంది టూరిస్టులు వచ్చేవారని ఆయన గుర్తుచేశారు.

అలాగే 80,000 మందికి పైగా దక్షిణాఫ్రికా పర్యాటకులు భారత్‌లో పర్యటించారని అనిల్ చెప్పారు.