నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో కాల్పుల కలకలం

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో పోలీసు కాల్పుల కలకలం చెలరేగింది.ట్రాన్స్ ఫార్మర్ల దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.

ఈ క్రమంలో పోలీసుల వాహనాన్ని దొంగల ముఠా ఢీకొట్టింది.అనంతరం ముఠా సభ్యులు పారిపోతుండగా వెంబడించిన పోలీసులు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.

పారిపోయిన నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.ముప్కాల్ వద్ద ట్రాన్స్ ఫార్మర్ లను అంతరాష్ట్ర ముఠా దొంగిలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

గత మూడు నెలలుగా నిజామాబాద్ జిల్లాలో ఈ చోరీలకు పాల్పడుతున్నారని సమాచారం.

చైతన్య శోభిత తొలిసారి అప్పుడే కలిశారట.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?