Ind Vs SL: మొదటి T20Iలోనే బద్దలైన 5 రికార్డులు… రోహిత్‌ను మించిపోయిన పాండ్యా?

భారత్‌ T20 సిరీస్‌ శ్రీలంకతో ఆరంభమైన సంగతి అందరికీ విదితమే.తాజాగా భరత్ టీమ్‌ కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలో వాంఖడే స్టేడియంలో మంగళవారం జరిగిన మొదటి T20 మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది.

అవును, ఈ కొత్త సంవత్సరంలో ఇండియా తన మొదటి T20 విజయాన్ని నమోదు చేసుకొని యావత్ భారత క్రికెట్ అభిమానులకు కానుకగా ఇచ్చింది.

ఈ నేపథ్యంలో 41 పరుగులతో రాణించిన దీపక్ హుడాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించడం గమనార్హం.

అలాగే శివమ్ మావి నాలుగు ఓవర్లలో 4 వికెట్లు తీయడం ఓ రికార్డ్ అని చెప్పుకోవాలి.

ఇలాంటివి ఎన్నో ఇక్కడ జరిగాయి.ఈ మ్యాచ్‌లో ఏకంగా 5 రికార్డులు బద్దలయ్యాయని చెప్పుకోవచ్చు.

కెప్టెన్‌గా మొదటి T20 ఓటమిని ఎదుర్కోకముందే.ఎక్కువ విజయాలు సాధించిన వ్యక్తిగా పాండ్యా రికార్డ్ బ్రేక్ చేసాడు.

రోహిత్‌ పేరిట ఉన్న రికార్డ్‌ను ఇతగాడు చెరిపేశాడు.అదే విధంగా శ్రీలంకతో జరిగిన T20 మ్యాచ్‌లో శివమ్‌ మావి అరంగేట్రం చేసిన సంగతి విదితమే.

కాగా అతను తొలి మ్యాచ్‌లోనే 4 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టాడు.సొంతగడ్డపై అరంగేట్రంలోనే అత్యుత్తమ T20I గణాంకాలు నమోదు చేసిన భువనేశ్వర్ కుమార్ రికార్డును బద్దలు కొట్టినట్టైంది.

"""/"/ ఇంకో రికార్డ్ గురించి చెప్పుకోవాలంటే.T20I క్రికెట్‌లో కనీసం 500 బంతులు వేసిన భారత బౌలర్లలో.

అతి ఎక్కువగా పరుగులు సమర్పించుకున్నది హర్షల్ పటేల్.కాగా శ్రీలంకతో జరిగిన తొలి T20లో పటేల్ 2/41 గణాంకాలు నమోదు చేసి భారత ఆటగాళ్లలో శార్దూల్ ఠాకూర్ 9.

15 ఎకానమీ రేటుతో 2వ స్థానానికి పడిపోయాడు.అలాగే వాంఖడే స్టేడియంలో T20ల్లో 200 కంటే తక్కువ పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది.

తొలి మ్యాచ్‌లో 163 పరుగుల లక్ష్యాన్ని మెన్ ఇన్ బ్లూ విజయవంతంగా కాపాడుకుంది.

ఇలా ఈ వేదికపై అత్యల్ప స్కోర్‌ను డిఫెండ్ చేసిన దక్షిణాఫ్రికా రికార్డును బద్దలు కొట్టింది.

1000 మంది స్టార్స్ కలిస్తే నా కొడుకు ప్రభాస్.. శ్యామలాదేవి కామెంట్స్ కు ఫిదా అవ్వాల్సిందే!