Pomegranate Leaves : దానిమ్మ ఆకులతో అంతులేని ఆరోగ్య లాభాలు.. అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
TeluguStop.com
ఈ ప్రకృతి మనకు వరంగా ఎన్నో అద్భుతమైన పండ్లను ప్రసాదించింది.అందులో దానిమ్మ( Pomegranate ) కూడా ఒకటి.
రుచి పరంగా పోషకాల పరంగా దానికి అదే సాటి.అయితే దానిమ్మ మాత్రమే కాదు దానిమ్మ చెట్టు ఆకులతో కూడా అంతులేని ఆరోగ్య లాభాలు( Health Benefits ) ఉన్నాయి.
అవేంటో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.ఇటీవల కాలంలో అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుంది.
కొలెస్ట్రాల్ పెరిగితే గుండెకు ముప్పు పెరుగుతుంది.కాబట్టి కొలెస్ట్రాల్ ను కరిగించుకోవడం ఎంతో అవసరం.
అయితే అందుకు దానిమ్మ ఆకులు తోడ్పడతాయి. """/"/ దానిమ్మ ఆకుల్లో ఉండే పలు సమ్మేళనాలు కొలెస్ట్రాల్( Cholestrol ) ను సమర్థవంతంగా కరిగిస్తాయి.
రక్తపోటును అదుపులో ఉంచుతాయి.గుండె జబ్బులకు అడ్డుకట్ట వేస్తాయి.
అలాగే దానిమ్మ ఆకులు జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి.కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలకు దానిమ్మ ఆకులు సహజ నివారిణిగా పనిచేస్తాయి.
దానిమ్మ ఆకుల్లో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి.ఇవి వివిధ రకాల బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ లకు వ్యతిరేకంగా పోరాడతాయి.
మధుమేహం ఉన్నవారికి కూడా దానిమ్మ ఆకులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.దానిమ్మ ఆకులు రక్తంలోని చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రిస్తాయి.
దానిమ్మ ఆకుల్లో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉంటాయి.దానిమ్మ ఆకులు కొన్ని రకాల క్యాన్సర్( Cancer ) అభివృద్ధిని నిరోధించడంలో అద్భుతంగా సహాయపడతాయి.
"""/"/
అంతేకాదు దానిమ్మ ఆకులు వెయిట్ లాస్( Weight Loss ) ను ప్రమోట్ చేస్తాయి.
ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే సెల్యులార్ డ్యామేజ్ ను తగ్గిస్తాయి.చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఇక మరి ఇన్ని ప్రయోజనాలను చేకూర్చే దానిమ్మ ఆకులను ఏ విధంగా ఆహారంలో భాగం చేసుకోవాలో కూడా తెలుసుకుందాం.
మూడు లేదా నాలుగు ఫ్రెష్ దానిమ్మ ఆకులు తీసుకుని శుభ్రంగా కడగాలి.ఆపై ఒకటిన్నర గ్లాస్ వాటర్ లో ఆ ఆకుల వేసి కనీసం 15 నిమిషాల పాటు మరిగించాలి.
ఆపై వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.ఈ విధంగా దానిమ్మ ఆకులను తీసుకుంటే పైన చెప్పిన ఆరోగ్య లాభాలన్ని మీ సొంతమవుతాయి.
కొడుకుకు నామకరణం చేసిన బిగ్ బాస్ మానస్.. ఏం పేరు పెట్టారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!