ఒంటికే కాదు రోజు పరిగెత్తడం వల్ల ఆ ప్రయోజనాలు కూడా పొందుతారు.. తెలుసా?
TeluguStop.com

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది ఊబకాయలుగా మారుతున్నారు.ఎక్కువగా తినడం తక్కువగా శ్రమించడం ఇందుకు ప్రధాన కారణం.


ఊబకాయాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రణాలకే ముప్పును పెంచుతుంది.అనేక రోగాలకు మూలం అవుతుంది.


అందుకే ఊబకాయం నుంచి బయటపడడానికి.పెరిగిన బాడీని తగ్గించుకునేందుకు తమ దినచర్యలో చాలా మంది రన్నింగ్ ను అలవాటు చేసుకుంటున్నారు.
అయితే ఒంటికే కాదు నిత్యం పరిగెత్తడం వల్ల మరికొన్ని అద్భుతమైన ప్రయోజనాలను కూడా మీరు పొందవచ్చు.
సింపుల్ గా చేసే వ్యాయామాల్లో రన్నింగ్ ఒకటి.నిత్యం ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు పరిగెత్తడం వల్ల ఒంటికి చాలా మంచిది.
ప్రధానంగా శరీరంలో అదనపు కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.బరువు తగ్గుతారు.
ఊబకాయం నుంచి బయటపడతారు.గుండె జబ్బులు( Heart Diseases ) వచ్చే ప్రమాదం తగ్గు ముఖం పడుతుంది.
కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.మధుమేహం ఉన్న వారిలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
"""/" /
నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
కీళ్ల నొప్పులు( Joint Pains ) నయం అవుతాయి.ఎముకలు దృఢంగా మారుతాయి.
స్త్రీ పురుషుల్లో లైంగిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.అయితే రన్నింగ్ వల్ల శారీరక ప్రయోజనాలే కాదు మానసిక ప్రయోజనాలు కూడా పొందొచ్చు.
ఇటీవల రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ఎంతో మంది ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో నలిగిపోతున్నారు.
ఈ క్రమంలోనే చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. """/" /
అయితే నిత్యం రన్నింగ్ చేయడం వల్ల మూడు బాగాలేదు అన్న ముచ్చటే ఉండదు.
రన్నింగ్ భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది.ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు అడ్డుకట్ట వేస్తుంది.
దాంతో ధూమపానం, మద్యపానం( Smoking, Drinking ) వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు.
రన్నింగ్ చేయడం వల్ల శారీరకంగా కానే కాకుండా మానసికంగా కూడా సూపర్ స్ట్రోంగ్ అవుతారు.
జ్ఞాపకశక్తి ఆలోచనా శక్తిని రెట్టింపు చేసే సామర్థ్యం కూడా రన్నింగ్ కు ఉంది.
వైరల్ వీడియో: ‘జంబలకిడిపంబ’ అంటే ఇదే కాబోలు!