స‌మ్మ‌ర్ లో రోజుకు 2 స‌పోటా పండ్లు తింటే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?

హమ్మయ్య చలి తగ్గింది అనుకునే లోపే ఎండలు మండిపోతు మంట పుట్టిస్తున్నాయి.వేసవికాలం( Summertime ) స్టార్ట్ కావడంతో పగటిపూట ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

వేసవి వేడిని తట్టుకొని నిలబడాలంటే బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా అవసరం.

అయితే అందుకు సహాయపడే బెస్ట్ అండ్ టాప్ ఫ్రూట్స్ లో సపోటా ఒకటి.

ప్రస్తుత వేసవి కాలంలో సపోటా పండ్లు( Sapota Fruits ) విరివిరిగా లభ్యం అవుతూ ఉంటాయి.

సపోటా తినడానికి రుచిగా ఉండటమే కాదు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, ఫాస్పరస్, సెలీనియం వంటి మిన‌ర‌ల్స్ తో పాటు యాంటీఆక్సిడెంట్స్‌, విట‌మిన్ సి, విట‌మిన్ ఎ, విట‌మిన్ బి వంటి ఎన్నో పోష‌కాల‌తో లోడ్ చేయ‌బ‌డి ఉంటుంది.

అటువంటి స‌పోటా పండును స‌మ్మ‌ర్ లో రోజుకు 2 చొప్పున తింటే అంతులేని ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.

వేసవికాలంలో నీరసం, అలసట వంటివి చాలా అధికంగా వేధిస్తూ ఉంటాయి.అయితే వీటికి చెక్‌ పెట్టడానికి సపోటా పండ్లు అద్భుతంగా సహాయపడతాయి.

రోజు ఉదయం 2 స‌పోటా పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి త‌క్ష‌ణ శక్తి లభిస్తుంది.

నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. """/" / అలాగే సపోటా పండ్ల‌లో పోషకాలతో పాటు నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది.

అందువల్ల వేసవికాలంలో సపోటా పండ్లను డైట్ లో చేర్చుకుంటే బాడీ డీహైడ్రేట్ ( Dehydrate The Body )అవ్వకుండా ఉంటుంది.

వేసవి వేడిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.వడదెబ్బకు గురికాకుండా ఉంటారు.

స‌మ్మ‌ర్ లో ర‌క్త‌పోటు స‌మ‌స్యతో ఎంతో మంది బాధ‌ప‌డుతుంటాయి.అయితే అలాంటి వారు స‌పోటాను తీసుకుంటే.

అందులో ఉండే పొటాషియం ,సోడియం స్థాయిలను( Potassium, Sodium Levels ) తగ్గించడంలో సహాయపడుతుంది.

రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది మరియు రక్తపోటును నియంత్రిస్తుంది. """/" / దృష్టి లోపాలు ఉన్నవారు నిత్యం సపోటా పండ్లను తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

సపోటాలో విటమిన్ ఎ( Vitamin A ) పుష్కలంగా ఉంటుంది.ఇది దృష్టి లోపాలను దూరం చేసి.

కంటి చూపులు చురుగ్గా మారుస్తుంది.అంతేకాదు రోజుకు రెండు స‌పోటా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది.

ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉంటే దూరం అవుతుంది.ఎముక‌ల‌ సాంద్ర‌త పెరుగుతుంది.

ఊపిరితిత్తులు, పెద్దప్రేగు, నోటి క్యాన్సర్ వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.గ‌ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.

కాబ‌ట్టి స‌మ్మ‌ర్ లో దొరికే స‌పోటాను అస్స‌లు వ‌దిలిపెట్ట‌కండి.

అపరిచితుడు తర్వాత ఆ రేంజ్ హిట్ లేదుగా.. తంగలాన్ తో ఆ కోరిక తీరుతుందా?