Fish Eyes : చేప కళ్ళు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు!
TeluguStop.com
సీ ఫుడ్ అనగానే దాదాపు అందరికీ చేపలు( Fish )మొదట గుర్తుకు వస్తాయి.
చేపల్లో ఎన్నో రకాలు ఉంటాయి.చాలా మంది చేపలను ఎంతో ఇష్టంగా తింటుంటారు.
రుచి పరంగానే కాదు చేపల్లో పోషకాలు సైతం మెండుగానే ఉంటాయి.అయితే చేపలు వండుకునే సమయంలో ఆల్మోస్ట్ అందరూ వాటికి ఉన్న కళ్ళను తీసి పారేస్తుంటారు.
కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే చేప కళ్ళు తినడం వల్ల అంతులేని ఆరోగ్య లాభాలు పొందవచ్చు.
అవును చిన్న గోళీలు మాదిరిగా ఉండే చేప కళ్ళు ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
"""/" /
చేప కళ్ళు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఎ మరియు ప్రోటీన్‌లకు గొప్ప మూలం.
చేప కళ్ళు ( Fish Eye )తింటే అందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె మరియు మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.
తరచూ చేప కళ్ళు తినే వారిలో గుండె సంబంధ జబ్బులు వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుందని పలు ఆధ్యయనాలు తేల్చాయి.
అలాగే చేప కళ్ళులో మెండుగా ఉండే విటమిన్ ఎ దృష్టిని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
/br> """/" /
చేప కళ్ళు తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
చేప కళ్ళను తినడం వల్ల మరో అద్భుతమైన ప్రయోజనం ఏంటంటే మధుమేహం( Diabetes ) వచ్చే రిస్క్ తగ్గుతుంది.
చేప కళ్ళు లో ఉండే పలు పోషకాలు శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని తగ్గిస్తాయి.
మధుమేహం బారిన పడకుండా రక్షిస్తాయి.అలాగే చేప కళ్ళు లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
ఒక చేప కంటిలో సుమారుగా 3.5 ఎమ్‌జీ విటమిన్ సి ఉంటుందట.
ఇది ఒక చిన్న నారింజలో కనిపించే దానికంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ.
అందువల్ల చేప కళ్ళు తింటే అందులో ఉండే విటమిన్ సి చర్మం, ఎముకలు, రక్త నాళాలు మరియు మొత్తం రోగనిరోధక పనితీరును నిర్వహించడానికి తోడ్పడుతుంది.
అంతేకాదు చేప కళ్ళు క్యాన్సర్ ప్రమాదాన్ని సైతం తగ్గిస్తాయి.ముఖ్యంగా ఫిష్ ఐను తరచూ తీసుకునే వారికి జీర్ణక్రియ, నోటి, స్వరపేటిక, పెద్దప్రేగు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుముఖం పడుతుంది.
ఈ హామ్ మేడ్ సీరంతో మీ ముఖ చర్మం సూపర్ వైట్ గా మారడం ఖాయం!