లవంగమా మజాకా.. తలనొప్పి నుంచి అజీర్తి వరకు ఎన్ని సమస్యలకు చెక్ పెడుతుందో తెలుసా..?

లవంగం.మసాలా దినుసుల్లో ఇది ఒకటి.

చూడటానికి చిన్నగా ఉన్నా కూడా రుచి మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది.నాన్ వెజ్, బిర్యానీ, పులావ్ వంటి వంటల్లో లవంగాలను కచ్చితంగా వాడతారు.

ఆహారం రుచిని పెంచడానికి లవంగాలు( Cloves) చాలా బాగా సహాయపడతాయి.అంతే అనుకుంటే పొరపాటే అవుతుంది.

లవంగాల్లో అనేక పోషకాలు మరియు ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉంటాయి.ఆయుర్వేద వైద్యంలో (Ayurvedic Medicine)లవంగాలను విరివిరిగా వాడుతుంటారు.

మనం నిత్యం ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు లవంగాలతో సులభంగా చెక్ పెట్టవచ్చు.బిజీ లైఫ్ స్టైల్ లో మనం తరచుగా ఎదుర్కొనే సమస్యల్లో తలనొప్పి ఒకటి.

విపరీతమైన తలనొప్పి(headache) ఉన్నప్పుడు చిటికెడు లవంగాల పొడికి వన్ టేబుల్ స్పూన్ అల్లం రసం(Ginger Juice), వన్ టేబుల్ స్పూన్ తేనె (honey)కలిపి తీసుకుంటే మంచి ఉపశమనాన్ని పొందుతారు.

వాంతులు, వికారంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో చిటికెడు లవంగాల పొడి, వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకుంటే ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చు.

"""/" / అలాగే అజీర్తి చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య.అజీర్తి (indigestion)కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.

అయితే భోజనానికి ముందు ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని నమిలి తినాలి.ఇలా కనుక చేస్తే భోజనం త్వరగా అరుగుతుంది.

అజీర్తి సమస్య తలెత్తకుండా ఉంటుంది.నోటి దుర్వాసన సమస్యను దూరం చేయడానికి కూడా లవంగాలు చాలా అద్భుతంగా సహాయపడతాయి.

లవంగాలు మరిగించిన నీటిని కనుక తీసుకుంటే నోట్లో మరియు కడుపులో ఉన్న బ్యాక్టీరియా నాశనం అవుతుంది.

నోటి దుర్వాసన సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. """/" / పొడి ద‌గ్గుతో బాధపడేవారు వేయించిన లవంగాన్ని నోట్లో పెట్టుకుని చప్పరించాలి.

ఇలా చేస్తే పొడి దగ్గు సమస్య పరారవుతుంది.ఇలా ఒక్కోసారి ఎన్ని వాటర్ తాగిన సరే మళ్లీ మళ్లీ దాహం వేస్తూనే ఉంటుంది.

అలాంటి సమయంలో ఒక గ్లాస్ నీటిలో రెండు లవంగాలు వేసే మరిగించి ఆ నీటిని తీసుకోవాలి.

ఇలా చేస్తే దప్పిక తీరుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 29, శనివారం 2024