గోరువెచ్చని నీళ్లు చేసే మాయాజాలం.. రోజు తాగితే అంతులేని ఆరోగ్య లాభాలు మీ సొంతం!

నిత్యం మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీళ్లు కూడా అంతే అవసరం.

సీజన్ ఏదైనా కూడా రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల వాటర్ ను కచ్చితంగా తాగాలని వైద్య నిపుణులు పదే పదే చెబుతుంటారు.

అయితే నార్మల్ వాటర్ కంటే గోరువెచ్చని నీళ్లు( Warm Water ) ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి.

గోరువెచ్చని నీళ్లు చేసే మాయాజాలానికి ఎవ్వరైనా దాసోహం అవ్వాల్సిందే.నిత్యం గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల అంతులేని ఆరోగ్య లాభాలు మీ సొంత‌మ‌వుతాయి.

జీర్ణ ప్రక్రియను వృద్ధి చేయడంలో.మలబద్ధకం( Constipation ) సమస్యను నివారించడంలో గోరు వెచ్చని నీళ్లు ఒక సహజ మెడిసిన్ లా పని చేస్తాయి.

రోజు ఉదయాన్నే పరగడుపున ఒకటి లేదా రెండు గ్లాసులు గోరు వెచ్చని నీళ్లు తాగితే మోషన్ ఫ్రీగా అవుతుంది.

అలాగే నెలసరి సమయంలో వచ్చే అనేక సమస్యలకు గోరు వెచ్చని నీళ్లతో చెక్ పెట్టవచ్చు.

ఆ టైంలో గోరువెచ్చని నీళ్లు తాగితే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.అలసట, విసుగు తగ్గుతాయి.

మొటిమలు రాకుండా ఉంటాయి. """/" / అలాగే ఉదయాన్నే రెండు గ్లాసులు గోరువెచ్చని నీళ్లు తాగితే ఏజింగ్( Aging ) ఆలస్యం అవుతుంది.

ముఖంపై త్వరగా ముడతలు ఏర్పడకుండా ఉంటాయి.చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

చల్లని వాతావరణంలో బద్ధకంగా ఉండి ఏ పని చేయలేకపోతుంటారు.అలాంటి సమయంలో గోరు వెచ్చని నీరు తాగితే బద్ధకం పరారవుతుంది.

శరీరం చురుగ్గా మారుతుంది.అవయవాలన్నీ ఉత్తేజితమవుతాయి.

"""/" / అలాగే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు తొలగిపోతాయి.

రక్త ప్రసరణ( Blood Circulation ) సాఫీగా సాగుతుంది.నరాల పనితీరు మెరుగుపడుతుంది.

అంతేకాదు తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యల నుంచి బయటపడడానికి కూడా గోరువెచ్చని నీళ్లు దోహదపడతాయి.

ఇక‌ ఉదయం నిద్రలేచిన తర్వాత, అల్పాహారం తీసుకునే ముందు గోరువెచ్చని నీరు త్రాగడానికి ఉత్తమ సమయం.

మ‌రియు భోజనానికి ముందు కూడా గోరువెచ్చని నీటిని తీసుకోవ‌చ్చు.

చిరంజీవి నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో పాతాళ భైరవి మూవీ రీమేక్.. ఏం జరిగిందంటే?