ఆరోగ్యానికి అండగా నిలిచే కివీ జ్యూస్.. వేసవిలో రోజూ తాగితే మస్తు బెనిఫిట్స్!
TeluguStop.com
వేసవికాలంలో కొన్ని రకాల పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అటువంటి పండ్లలో కివీ( Kiwi ) కూడా ఒకటి.
పోషకాలు మెండుగా ఉండే కివీ పండు ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది.ముఖ్యంగా ప్రస్తుత సమ్మర్ సీజన్లో రెగ్యులర్ గా కివీ జ్యూస్ తీసుకుంటే మస్తు బెనిఫిట్స్ పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
మరి ఇంకెందుకు ఆలస్యం కివీ పండ్లతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి.? అసలు కివీ జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయి.
? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
ముందుగా రెండు కివీ పండ్లను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ లో కట్ చేసి పెట్టుకున్న కివీ పండు ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, చిటికెడు నల్ల ఉప్పు మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలుపుకుని తాగేయడమే.
ఈ కివీ జ్యూస్ ను సమ్మర్ సీజన్ లో నిత్యం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
"""/" /
ముఖ్యంగా వేసవిలో కివీ జ్యూస్ బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది.
వేసవి వేడిని తట్టుకునే సామర్థాన్ని చేకూరుస్తుంది.డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది.
అలాగే సమ్మర్ లో చాలా మంది అధిక రక్తపోటుకు గురవుతుంటాయి.అయితే కివీ జ్యూస్‌ను నిత్యం తీసుకుంటే రక్తపోటు స్థాయిలు తగ్గుతాయి.
కివీ జ్యూస్‌లో పొటాషియం, ఫైబర్ మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి గుండె ఆరోగ్యాన్ని( Heart Health ) మెరుగుపరుస్తాయి.కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అలాగే కివీ జ్యూస్ డయాబెటిక్ రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామార్థ్యం కివీ జ్యూస్‌కు ఉంది.
అయితే మధుమేహం ఉన్నవారు ఎటువంటి స్వీట్నర్ యాడ్ చేయకుండా కివీ జ్యూస్ ను తీసుకోవాలి.
అంతేకాకుండా కివీ జ్యూస్‌ను నిత్యం తీసుకోవడం వల్ల రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటాయి.
ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.కివీ జ్యూస్ మంచి నిద్రకు సహాయపడుతుంది.
క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సైతం తోడ్పడుతుంది.
ఈ న్యాచురల్ క్రీమ్ తో వైట్ అండ్ స్మూత్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?