తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంపు

తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది.దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనతో ఇంటిలిజెన్స్ విభాగం అలెర్ట్ అయింది.

ఈ క్రమంలో 2+2, 3+3 గా ఉన్న భద్రతను 4+4 గా పెంచుతూ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు అన్ని పోలీస్ కమిషనర్లకు, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.

పోటీలో ఉన్న అభ్యర్థులకు మాత్రం వెంటనే భద్రత కల్పించాలని సూచించారు.అయితే ఎన్నికల ప్రచారాన్ని ముగించి తిరిగి వస్తున్న సమయంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.

కాగా ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మానవత్వం మంటగలిసింది.. శవం కాళ్లకు గుడ్డ కట్టి ఎలా ఈడ్చుకెళ్లారో చూస్తే..