టి బీజేపీ లో ' కుర్చీ ' పోరు ? మూడు గ్రూపులుగా.. ?

గతంతో పోలిస్తే తెలంగాణ బిజెపి లో కాస్త ఊపు కనిపిస్తోంది.టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బలమైన శక్తిగా బిజెపి మారుతున్నట్లు గా అనేక సంకేతాలు వెలువడుతున్నాయి.

వరుసగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించి రెండు స్థానాల్లో బిజెపి విజయం సాధించింది.

మిగతా చోట్ల ఫర్వాలేదు అన్న స్థాయిలో బీజేపీ బలంగా ఉంది.కాంగ్రెస్ ప్రభావం పెద్దగా కనిపించకపోవడం బీజేపీకి వరంగా మారింది.

దీనికితోడు టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత రాబోయే రోజుల్లో తమను అధికారంలో కూర్చో పెడుతుందనే నమ్మకంతో తెలంగాణ బిజెపి నాయకులు ఉన్నారు.

ఇదిలా ఉంటే 2023 ఎన్నికల్లో బిజెపి తప్పకుండా అధికారంలోకి వస్తుందని తెలంగాణ బిజెపి నాయకులు కొంతమంది భారీగానే ఆశలు పెట్టుకున్నారు.

  ఒకవేళ బీజేపీ ప్రభుత్వం కనుక ఏర్పాటు చేస్తే తమకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందనే సంకేతాలు ఇస్తున్నారు.

ఈ సంకేతాలను సందర్భం వచ్చినప్పుడు ప్రస్తావిస్తూ తామే ముఖ్యమంత్రి కాబోతున్నమనే సంకేతాలను పరోక్షంగా వెల్లడిస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అనేక సమావేశాల్లో తొలి సంతకం గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు.

  బిజెపి తెలంగాణలో అధికారంలోకి రాగానే పేదలందరికీ ఉచిత విద్యుత్ ఫైల్ పై తొలి సంతకం పెడతామని చెబుతున్నారు.

కాకపోతే ఎక్కడా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటూ ప్రస్తావించకుండా,  తాము అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

  """/"/ ముఖ్యమంత్రి కుర్చీ లో ఎవరు కూర్చున్న,  వారితో ఆ హామీ అమలు విషయంలో సంతకం పెట్టించే బాధ్యత తీసుకుంటాను అంటూ మిగతా నాయకులకు బాధ కలగకుండా సమయస్ఫూర్తితో వ్యాఖ్యలు చేస్తున్నారు.

అలాగే ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత సీఎం కుర్చీ రేసు బిజెపిలో బాగా పెరిగిపోయింది.

అంతకు ముందు బండి సంజయ్,  కిషన్ రెడ్డి మధ్య పోటీ అన్నట్లుగా పరిస్థితి కనిపించింది.

అయితే టిఆర్ఎస్ నుంచి వచ్చిన రాజేందర్ కు బలమైన పునాదులు తెలంగాణలో ఉండడం,  కేసీఆర్ ను ఢీ కొట్టేంత స్థాయి ఆయనకు ఉండడంతో ఆయన పై బీజేపీ అధిష్టానం పెద్దలు సానుకూలంగా ఉండడంతో ఆయనకు ఛాన్స్ దక్కకుండా, ఒకవైపు బండి సంజయ్, మరోవైపు కిషన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.

దీనిలో భాగంగానే ఎవరికివారు సొంతంగా బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వ్యవహారాలు చేస్తుండటంపై బీజేపీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ మద్యం తాగుతాడా అనే ప్రశ్నకు ఆ ఏఐ చెప్పిన జవాబిదే.. ఏం చెప్పిందంటే?