గాజులదిన్నె ప్రాజెక్టు నీటి సామర్థ్యం పెంపు.. అదనంగా 10 వేల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ..
TeluguStop.com
కర్నూలు జిల్లా, గోనెగండ్ల దామోదరం సంజీవయ్య సాగర్ ప్రాజెక్ట్ (గాజులదిన్నె) అదనపు టీఎంసీ నీటి సామర్థ్యం పెంపు పనులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంలు పేర్కొన్నారు.
శుక్రవారం గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టులో రు.57.
35 కోట్లతో ప్రస్తుతం 4.5 టీఎంసీల సామర్థ్యం నుండి 5.
5 టీఎంసీల నీటి సామర్థ్యం పెంపు పనులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంలు భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణానికి త్రాగునీటి అవసరాలు, జిల్లా పశ్చిమ ప్రాంతంలో రోజురోజుకూ పెరుగుతున్న నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని గాజులదిన్నె ప్రాజెక్టు ఒక మీటరు మట్టికట్ట ఎత్తును పెంచి అదనంగా ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం పెంచుతున్నట్లు తెలిపారు.
ప్రాజెక్ట్ సామర్థ్యం పెంపునకు కావాల్సిన 300 ఎకరాల భూ సేకరణకు సైతం ఎకరా రూ.
12.60 కోట్లు, కరకట్టల ఎత్తు పెంపుతో పాటు మిగిలిన హెడ్వర్క్ పనులు రూ .
36.65 కోట్లతో చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఒక టీఎంసీ అంటే పది వేల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ అవుతుందన్నారు.260 కోట్ల రూపాయలతో కోడుమూరు, ఆలూరు, పత్తికొండ, డోన్ ప్రాంతాలలోని 68 చెరువులకు త్వరలోనే నీటిని నింపడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కర్నూలు జిల్లాపై ప్రత్యేక అభిమానం చూపుతూ ప్రజా పనులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ మంజూర్లు చేస్తున్నారన్నారు.
కర్నూలు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు న్యాయ రాజధానిగా ప్రకటించడంతో పాటు జగన్నాథ గట్టుపై సిల్వర్ జూబ్లీ కాలేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు.
అలాగే హైకోర్టు, నేషనల్ లా యూనివర్సిటీ, జుడిషియల్ అకాడమీ తదితర సంస్థలు రాబోతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.
కర్నూలు నగరానికి సంబంధించి డ్రైనేజీ సిస్టం మెరుగు పరచడంతో పాటు రోడ్లు, కల్వర్ట్లు ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
"""/"/
జిల్లాకు రెండు జాతీయ రహదారులు మంజూరు అయ్యాయని అన్నారు.కోవిడ్ పరిస్థితులు భయంకరంగా వచ్చినప్పటికీ ఏ మాత్రం జంకకుండా సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు అభివృద్ధి పనులకు కూడా పెద్ద పీట వేశామన్నారు.
ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ బిల్లులు చెల్లింఫుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.తెలిపారు రాబోయే కొన్ని నెలల్లోనే చిన్నా, చితక బిల్లులు కూడ క్లియర్ చేస్తామని మంత్రి చెప్పారు.
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
ఎమ్మిగనూరు శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ గాజులదిన్నె ప్రాజెక్టు ఎత్తు పెంచడం ద్వారా ఎమ్మిగనూరు పట్టడానికి త్రాగునీటి సమస్య ఉండదన్నారు.
ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, గాజులదిన్నె సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఇరిగేషన్ సీఈ మురళీధర్ రెడ్డి, ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డి, ఆదోని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, గోనెగండ్ల తాసిల్దార్ వేణుగోపాల శర్మ,జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
చైనాలో కదిలించే ఘటన.. 3 ఏళ్లుగా కవల సోదరిలా నటించిన అమ్మాయి!