విత్తన శుద్ధి చేసి పంటలు పండిస్తే ఇన్ని ప్రయోజనాలా..?

వ్యవసాయంలో అధిక దిగుబడి( High Yielding ) పొందాలంటే కీలకం నాణ్యమైన విత్తనాలు.

విత్తనాలను( Seeds ) శుద్ధి చేసుకుని విత్తుకోవాలి.ఇలా చేస్తే భూమి లోపల ఉండే వివిధ తెగుళ్ళ, చీడపీడల ప్రభావం విత్తనాలపై తక్కువగా ఉంటుంది.

భూమిలో గతంలో పంటకు వేసిన అవశేషాలలో వైరస్, బ్యాక్టీరియా లకు సంబంధించిన శిలీంద్రాలు జీవించి ఉంటాయి.

ఇవి విత్తిన విత్తనాలను ఆశించడం వల్ల, వీటి నివారణ కోసం ఎన్నో రకాల రసాయన పిచికారి మందులను ఉపయోగించాల్సి ఉంటుంది.

దీంతో పెట్టుబడి భారం అధికం అవుతుంది.వ్యవసాయంలో నివారణ కంటే నిరోధనే మేలు.

విత్తనాలను ఎలా శుద్ధి చేసుకోవాలి.ఎటువంటి విత్తనాలను ఎంచుకొని సాగు చేయాలి అనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

మార్కెట్లో ఎన్నో రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.అందులో చాలా వరకు నకిలీ విత్తనాలు( Fake Seeds ) ఉన్నాయనే విషయం రైతులందరికీ తెలిసిందే.

కాబట్టి సర్టిఫైడ్ కంపెనీలకు చెందిన విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకొని సాగు చేయాలి.

"""/" / రెండవది ఏ పంట వేసినా ముందుగా విత్తన శుద్ధి అనేది తప్పనిసరి.

విత్తన శుద్ధి ( Seed Purification ) చేస్తే నేల ద్వారా వచ్చే చీడపీడలు, తెగుళ్ల నుంచి పంట సంరక్షించబడుతుందని వ్యవసాయ క్షేత్ర నిపుణులు సూచిస్తున్నారు.

విత్తన శుద్ధి చేసిన ప్రతి విత్తనం మొలక ఎత్తుతుంది.విత్తన శుద్ధి అనేది విత్తనానికి ఒక రక్షక కవచంలో పనిచేయడం వల్ల మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుంది.

విత్తన శుద్ధి ముందుగా కీటక నాశనం మందులతో చేయాలి. """/" / ఆ తర్వాత ఓ గంట పాటు నీడలో ఆరబెట్టి సిలింద్రనాసిని మందులతో శుద్ధిచేసి, చివరగా జీవన ఎరువులతో విత్తన శుద్ధి చేసుకుని నీడలో ఆరబెట్టిన తర్వాత ప్రధాన పంట పొలంలో విత్తుకోవాలి.

దీంతో దాదాపుగా రసాయన పిచికారి మందుల అవసరం ఉండదు.తద్వారా మందుల ఖర్చు, కూలీల ఖర్చు ఆదా అవ్వడంతో పాటు నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చు.

వైరల్: చలికాలంలో కురాళ్లకు హీటేక్కిస్తున్న యువతి.. ఏం చేస్తోందో చూడండి!