సైబర్ వలలో చిక్కిన ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్..కేవలం రూ.5తో బురిడీ కొట్టించిన కేటుగాడు..!

ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల దాదాపుగా అన్ని పనులు కూడా ఎంతో సులభతరంగా మారిపోయాయి.

కానీ సైబర్ నేరగాళ్లు( Cyber Criminals ) టెక్నాలజీని ఉపయోగించుకునే ప్రజలను బురిడీ కొట్టించడం కోసం అన్ని దారులు తెరిచే ఉంచారు.

ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఓ సమయంలో ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతూ లక్షల డబ్బులు పోగొట్టుకుంటున్నారు.

ఈ క్రమంలో ఏకంగా ఒక ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్( Income Tax Officer ) సైబర్ వలలో చిక్కి రూ.

98500 రూపాయలు పోగొట్టుకున్నాడు.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

"""/" / వివరాల్లోకెళితే.పశ్చిమబెంగాల్ కు చెందిన నిశాంత్ కుమార్( Nishant Kumar ) అనే వ్యక్తి ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు.

ఈ నిశాంత్ కుమార్ దీపావళి పండుగ సందర్భంగా కోల్ కత్తా నుంచి కొన్ని స్వీట్లు ( Sweets ) ఆర్డర్ చేశాడు.

13వ తేదీ వచ్చినా కూడా ఆర్డర్ చేసిన స్వీట్ లు అందలేదు.దీంతో నిశాంత్ కుమార్ కస్టమర్ కేర్ సిబ్బందికి ఫోన్ చేసి, పార్సల్ ఇంకా అందలేదని తెలిపాడు.

అవతలి వైపు మాట్లాడిన వ్యక్తి పార్సిల్ ను ట్రాక్ చేయాలంటే రూ.5 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలని కోరగా.

నిశాంత్ కుమార్ ఐదు రూపాయలను ట్రాన్స్ఫర్ చేశాడు. """/" / ఈ ట్రాన్సాక్షన్ జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే నిశాంత్ కుమార్ ఖాతా నుంచి ఏకంగా రూ.

98500 ఆన్లైన్ ట్రాన్సాక్షన్ బదిలీ జరిగింది.దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న నిశాంత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రభుత్వాలు, అధికారులు సైబర్ నేరాల దృష్ట్యా అవగాహన కల్పిస్తున్న, ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా సైబర్ కేటుగాళ్లు చాలా సులభంగా బురిడీ కొట్టించి దొరికినంత వరకు దోచేస్తున్నారు.

కాబట్టి ఆన్లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.