ప్ర‌స‌వం త‌ర్వాత ఈ ఫుడ్స్‌ను డైట్ లో చేర్చుకుంటే తల్లీ బిడ్డల ఆరోగ్యానికి తిరుగుండ‌దు!

ప్రసవ సమయంలోనే కాదు ప్రసవం అనంతరం ప్రతి తల్లి ఎన్నో సవాళ్లను, సమస్యలను ఎదుర్కొంటుంది.

నిద్రలేని రాత్రులను గడుపుతుంది.ఆ సమయంలో ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించిన తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యం పై సైతం ప్రభావం పడుతుంది.

మొదటి ఆరు నెలలు బిడ్డ ఆహారం తల్లిపాలే.అందుకే తల్లి ప్రసవం అనంతరం పోషకాహారాన్ని తీసుకోవాలి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకుంటే తల్లీ బిడ్డల ఆరోగ్యానికి తిరుగుండదు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.బాదంపప్పు.

అద్భుతమైన నట్స్ లో ఇది ఒకటి.ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ అందుకు తగ్గ పోషకాలు బాదం పప్పులో ఉంటాయి.

ముఖ్యంగా ప్రసవం అనంతరం ప్రతి తల్లి ఐదు నుంచి ఎనిమిది బాదం పప్పులను నైట్ నిద్రించే ముందు వాటర్ లో నానబెట్టి ఉదయాన్నే పొట్టు తొలగించి తినాలి.

ఇలా చేస్తే బాదం పప్పులో ఉండే ఎన్నో పోషకాలు తల్లీ బిడ్డలకు లభిస్తాయి.

ప్రసవం అనంత‌రం ప్రతి త‌ల్లిని నీరసం, అలసట వంటివి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.

అయితే వాటికి చెక్‌ పెట్టడంలో బాదం గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది. """/"/ ప్రసవం అనంతరం తల్లి జీర్ణ‌ వ్యవస్థ బలహీన పడుతుంది.

దీని కారణంగా ఏమి తిన్నా సరే గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు సతమతం చేస్తుంటాయి.

అయితే వీటి నుంచి రక్షణ కల్పించడంలో వాము సహాయపడుతుంది.ఒక గ్లాస్ వాటర్ లో అర‌ టేబుల్ స్పూన్ వామును వేసి మరిగించి సేవించాలి.

ఈ వాటర్ ను రోజుకు ఒకసారి తీసుకుంటే తల్లితో పాటు బిడ్డ జీర్ణ వ్యవస్థ సైతం చురుగ్గా పనిచేస్తుంది.

"""/"/ ప్ర‌స‌వం అనంతరం ప్రతి తల్లి తీసుకోవాల్సిన మరో సూపర్ ఫుడ్ పంజిరి.

అనేక రకాల గింజలు, బెల్లం తో కలిపి చేసే ఒక తీపి పదార్థం ఇది.

చక్కటి రుచిని కలిగి ఉండే పంజిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.దీన్ని రోజు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుంది.బిడ్డ‌ ఎదుగుదలకు ఉపయోగపడే పోషకాలు ఎన్నో పంజిరి ద్వారా పొందొచ్చు.

వెయిట్ లాస్ కు సైతం పంజిరి సహాయపడుతుంది.ఇక కూరగాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

ప్రసవం అనంతరం డాక్టర్ సూచించిన కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.కూరగాయలు పాల ఉత్పత్తిని పెంచడమే కాదు బ‌రువును సైతం తగ్గిస్తాయి.

మరియు బోలెడన్ని పోషకాలను అందిస్తాయి.

జేసీ పరేషాన్ : కూటమి పార్టీలకు మరో తలనొప్పి