Weakness Of Bones : రోజూ ఈ పండును తిన్నారంటే మోకాళ్ళ నొప్పులు మటుమాయం అవ్వాల్సిందే?

ఎముకల బలహీనత( Weakness Of Bones ).ఒకప్పుడు వయసు పైబడిన వారిలో మాత్రమే తలెత్తేది.

కానీ నేటి ఆధునిక కాలంలో పాతిక, ముప్పై ఏళ్లకే కోట్లాది మందిలో ఎముకల బలహీనత ఏర్పడుతుంది.

ఫలితంగా మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.అయితే ఎలాంటి సమస్యకైనా ఈ ప్రకృతిలో పరిష్కారం ఉంటుంది.

ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో పియర్ ఫ్రూట్ ( Pear Fruit )ఒకటి.

చూడటానికి చాలా ఆకర్షణీయంగా మరియు తినడానికి అంతకంటే ఎక్కువ రుచికరంగా ఉండే పియర్ ఫ్రూట్ అనేక పోషకాలను కూడా కలిగి ఉంటుంది.

ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది.ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి పియర్ ఫ్రూట్ ఒక వరమనే చెప్పుకోవచ్చు.

పియర్ పండులో రాగి, కాల్షియం, భాస్వరం, మాంగనీస్ మరియు మెగ్నీషియం వంటి మిన‌ర్స‌ల్‌ గణనీయమైన మొత్తంలో ఉంటాయి.

ఇవి ఎముకల ఆరోగ్యం లో కీలక పాత్ర పోషిస్తాయి.ఎముకలు బలంగా ఉండడానికి తోడ్పడతాయి.

ఎముక ఖనిజ నష్టాన్ని నివారించడానికి మరియు ఎముకల్లో సాంద్రత పెంచడానికి పియర్ ఫ్రూట్ సహాయపడుతుంది.

"""/" / నిత్యం ఒక పియర్ ఫ్రూట్ ను తిన్నారంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు( Knee Pains, Joint Pains ) మటుమాయం అవుతాయి.

ఎముకలు దృఢంగా మారతాయి.బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

అలాగే పియర్ పండును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

పియర్ ఫ్రూట్ లో ఇనుము మరియు రాగి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.అందువల్ల ఈ పండు రక్తహీనతను నివారిస్తుంది.

కండరాల బలహీనతను దూరం చేస్తుంది. """/" / పియర్ ఫ్రూట్‌లో ఉండే పొటాషియం( Potassium ) రక్తపోటును తగ్గించడంలో సహాయ‌ప‌డుతుంది.

శరీరంలోని అన్ని భాగాలలో రక్త ప్రసరణ పెంచుతుంది.పియ‌ర్ పండులో ఉండే ఫైబ‌ర్‌ గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.

పియర్ లోని యాంటీ ఆక్సిడెంట్స్‌ మన శరీరంలోని క్యాన్సర్ కారక కణాలను నాశనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

ఇక పియ‌ర్ ఫ్రూట్ లో ఉండే ఉండే విటమిన్ సి మరియు విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్ప‌డుతుంది.

హిందూ భక్తులపై దాడి చేసిన ఖలిస్తానీలు..(వీడియో)