కృతిశెట్టి, శ్రీలీలలా చేసుంటే సినిమా ఛాన్స్ లు వచ్చేవి.. ఇనయా సుల్తానా కామెంట్స్ వైరల్!
TeluguStop.com
కృతిశెట్టి, శ్రీలీల చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించారనే సంగతి తెలిసిందే.
17 సంవత్సరాల వయస్సులోనే హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టడం ఈ హీరోయిన్లకు వరమైంది.
ఇనయా సుల్తానా( Inaya Sultana ) తాజాగా ఒక సందర్భంలో కృతిశెట్టి, శ్రీలీలలా చేసుంటే సినిమా ఛాన్స్ లు వచ్చేవి అంటూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది అమ్మాయిలు టీనేజ్ లోనే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతున్నారని 17 ఏళ్ల వయస్సులోనే స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు సంపాదించుకుంటున్నారని ఇనయా సుల్తానా అన్నారు.
కృతిశెట్టి, శ్రీలీల( Kriti Shetty ) కూడా చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి వచ్చారని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.
నేను మాత్రం 22 ఏళ్లకు సినిమా ఇండస్ట్రీకి వచ్చానని ఆమె తెలిపారు. """/" /
ఇతర హీరోయిన్లతో పోల్చి చూస్తే ఏడేళ్లు వృథా చేసుకున్నానని ఇనయా అన్నారు.
ఆ హీరోయిన్ల మాదిరిగా నేను కూడా ముందే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటే నా జీవితం మరోలా ఉండేదని ఆమె కామెంట్లు చేశారు.
ప్రస్తుతం వాటి గురించి పట్టించుకోనని ఇనయ సుల్తానా పేర్కొన్నారు.ప్రస్తుతం మనం 60 ఏళ్లకు మించి జీవించే ఛాన్స్ లేదని ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదని ఆమె చెప్పుకొచ్చారు.
"""/" /
నా ఏజ్ 25 అని దేవుడి దయ వల్ల మహా అయితే మరో 25 సంవత్సరాలు బ్రతుకుతానేమో అని ఇనయా కామెంట్లు చేశారు.
ఈ లైఫ్ లో నేను ఎంజాయ్ చేసేది 10 నుంచి 15 ఏళ్లు మాత్రమేనని ఆమె పేర్కొన్నారు.
ఆ తర్వాత ఎంజాయ్ చేయాలన్నా శరీరం సహకరించదని ఇనయా తెలిపారు.ఎన్నో ఆఫీసుల చుట్టూ అడుక్కున్నా ఫలితం లేకుండా పోయిందని ఆమె చెప్పుకొచ్చారు.
బిగ్ బాస్ ( Big Boss ) కంటెస్టెంట్ ఇనయా సుల్తానాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
నా భార్యను ఈ గొడవలోకి లాగారు… ఎవరిని వదిలిపెట్టను: మంచు మనోజ్