కొత్త వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను ఆవిష్కరణ.. అందులోని ఫెసిలిటీస్ చూస్తే ఫిదా..?

తాజాగా ఇండియన్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్( Ashwini Vaishnaw ) వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రోటోటైప్‌ను ప్రారంభించారు.

ఇక్కడ ప్రోటోటైప్ అంటే ఒక ఉదాహరణ, అసలు రైలు ఎలా ఉంటుందో చూపించే మోడల్.

మన దేశంలో ఇంకా వందే భారత్ స్లీపర్ కోచ్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు కాకపోతే మోడల్ మాత్రం లేటెస్ట్ గా డెవలప్ చేశారు.

ఈ వందే భారత్ ట్రైన్ లో పడుకుని ప్రయాణించే సౌకర్యం ఉంటుంది.ఈ రైలు ఎలా ఉంటుందో చూపించే ప్రోటోటైప్‌ మోడల్‌ను బెంగళూరులోని బీఈఎంఎల్స్ ఫ్యాక్టరీలో ప్రదర్శించారు.

ఈ రైలు చాలా అడ్వాన్స్‌డ్‌ ఫెసిలిటీలతో వస్తుందని ఉంటుందని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.

ఈ ట్రైన్ ను ఇంకా పూర్తిగా పరీక్షించాలి.ఈ పరీక్షలు రెండు నెలల్లో పూర్తయితే, డిసెంబర్ నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి రావచ్చు.

కొత్తగా తయారైన వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 బోగీలు ఉన్నాయి.

ఈ బోగీల గురించి కొంచెం వివరంగా చెప్పాలంటే.h3 Class=subheader-styleఏసీ 3-టైర్ బోగీలు:/h3p ఈ రకమైన బోగీలు 11 ఉన్నాయి.

ఇందులో మొత్తం 611 బెర్తులు ఉంటాయి.ఇవి మనకు తెలిసిన సాధారణ రైళ్లలో ఉన్న 3-టైర్ బోగీల మాదిరిగానే ఉంటాయి.

కానీ, వందే భారత్ రైలు కాబట్టి ఇందులో సౌకర్యాలు మరింత ఎక్కువగా ఉంటాయి.

"""/" / H3 Class=subheader-styleఏసీ 2-టైర్ బోగీలు:/h3p ఈ రకమైన బోగీలు 4 ఉన్నాయి.

ఇందులో మొత్తం 188 బెర్తులు ఉంటాయి.ఇవి 3-టైర్ బోగీల కంటే కొంచెం సౌకర్యంగా ఉంటాయి.

H3 Class=subheader-styleఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్:/h3p ఈ రకమైన బోగీ ఒక్కటే ఉంటుంది.

ఇందులో మొత్తం 24 బెర్తులు ఉంటాయి.ఇది రైలులో అత్యంత సౌకర్యవంతమైన బోగీ.

"""/" / అశ్విని వైష్ణవ్ ప్రకారం, ఈ కొత్త వందే భారత్ రైలు( Vande Bharat)ను చాలా జాగ్రత్తగా రూపొందించారు.

ప్రతి చిన్న విషయం గురించి ఆలోచించి డిజైన్ చేశారు.ముఖ్యంగా, వికలాంగులకు కూడా సౌకర్యంగా ఉండేలా ప్రతి టాయిలెట్‌ను రూపొందించారు.

అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ఈ ట్రైన్‌లో పని చేసే ప్రతి ఒక్కరి సౌకర్యాన్ని గురించి ఆలోచించాం.

లోకో పైలట్, రైలును మరమ్మతు చేసే వారు, బెడ్‌షీట్లు, ఆహారం అందించే వారు అందరికీ సౌకర్యంగా ఉండేలా చూశాం.

ట్రైన్ టెస్టింగ్ కు ఒకటి నుంచి రెండు నెలల సమయం పడుతుంది.ఇవి పూర్తయ్యాక, మూడు నెలలలో ఈ రైలును ప్రజలు ప్రయాణించవచ్చు.

" అని అన్నారు.

‘గుర్తుపెట్టుకో మిస్టర్ చీఫ్ మినిస్టర్ ‘  కేటీఆర్ వార్నింగ్