జూన్ 2న తెలంగాణ కొత్త అధికారిక గీతం, చిహ్నాం ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్( Congress ) ప్రభుత్వం కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టబోతోంది.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు స్వల్ప మార్పులతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు.

ఈ క్రమంలో వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర గీతం, చిహ్నాన్ని ఆయన ఆవిష్కరిస్తారు.

అయితే కవి అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు చేయడంతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో( MM Keeravani ) స్వరాలు సమకూర్చడం ప్రస్తుతం వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే.

దీనిపై తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.జయజయహే పాటను స్వర పరిచేందుకు సంగీత దర్శకులెవరు లేరా అని తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ ప్రశ్నించింది.

మరోవైపు రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక పాలన గుర్తులైన కాకతీయ తోరణంతో పాటు చార్మినార్ ను కూడా తీసివేయాలని రేవంత్ రెడ్డి( Revanth Reddy ) భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్ర చిహ్నం రూపకల్పన బాధ్యతలను నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తికి అప్పగించిన సంగతి తెలిసిందే.