ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుద్ద జల కేంద్రం ప్రారంభోత్సవము..

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రతిమ మీ ముంగిట్లో ఆనే నినాదం తో ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ, ప్రతిమ ఫౌండేషన్ ( Pratima Foundation ) మారుమూల గ్రామాల ప్రజల అవసరాలను గుర్తించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం లోని కథలాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ మోడల్ స్కూల్ ( Telangana Model School )లోని విద్యార్థుల మంచి నీటి సమస్య గురించి డాక్టర్ చెన్నమనేని వికాస్ దృష్టి కి తీసుకరావడంతో వారి అభ్యర్థనకు స్పందించి ఉచిత మంచి నీటి శుద్ద జల కేంద్రంని డోనేట్ చేయడం జరిగింది.

అనేక రకాల జబ్బులకు కలుషిత నీరే కారణం త్రాగే నీరు( Drinking Water ) శుద్ధ జలమై ఉండాలి, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశ్యం తో ఈ మంచి నీటి శుద్ద జల కేంద్రం ను డోనేట్ చేయడం జరుగుతుంది.

ఈ కార్యక్రమం 01.03.

2024 శుక్రవారం ఉదయం 9.30 గంటల కు తెలంగాణ మోడల్ స్కూల్ లో ప్రారంభం కానుంది.

ఈ ప్రారంభోత్సవంకు ముఖ్య అతిథిగా ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ చెన్నమనేని వికాస్ దీప( Dr Chennamaneni Vikas ) దంపతులు హాజరై ప్రాంభించనున్నారు.

శంకర్ సినిమాలకు గుడ్ బై చెబితే బెటర్.. ఆ రేంజ్ లో ఎవరూ ఖర్చు చేయరంటూ?