వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి వరి ధాన్యాం గింజను కొనుగోలు చేస్తామని ఎల్లారెడ్డిపేట జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు అన్నారు.

ఆదివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఐకెపి ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎల్లారెడ్డిపేట మండల ఎంపిపి పిల్లి రేణుక కిషన్,జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి తో కలిసి ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యులు చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి రైతులు ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధరను పొందాలని ఈ సందర్భంగా వారు తెలిపారు.

అలాగే వరి క్వింటాల్ ధాన్యానికి 2060.రూపాయల ప్రభుత్వం మద్దతు ధర పొందాలని రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి నిర్వాహకులకు సహకరించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి , సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, ఎంపిటీసీ సభ్యురాలు ఎలగందుల అనసూయ నర్సింలు, ఎపిఎం మల్లేశం, మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి,వార్డు సభ్యులు న్యాలకంటీ దేవేందర్, జవ్వాజీ లింగం, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, రైతులు మద్దుల బాల్ రెడ్డి,బాద రమేష్ , నర్సింహారెడ్డి,రాజిరెడ్డి, కిషన్, లింగన్న , బామ్మగారి రాజిరెడ్డి, మద్దుల శ్రీపాల్ రెడ్డి, సాదు నర్సింహారెడ్డి,ఐకెపి ఉద్యోగులు మంగ్యా నాయక్ , సురేందర్ , మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ప్రభాస్, మహేష్ లతో పోటీపై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు.. నన్ను మించి ఎదిగేటోడు అంటూ?